అవార్డులు..హాలీవుడ్ కాదు? కావాల్సింది అది!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అవార్డులు..రివార్డులు..హాలీవుడ్ అవ‌కాశాల ప‌ట్ల దీపికా ప‌దుకొణే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2024-05-18 12:30 GMT

హాలీవుడ్ లో ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. ఇక అవార్డులు...రివార్డుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాటిని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి గౌర‌విస్తుంటారంతా. బాలీవుడ్ నుంచి అవార్డులు అందుకున్న వారెంతో మంది ఉన్నారు. హాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్లు కొంద‌రున్నారు. ఇలా ఎంత మంది ఉన్నా హాలీవుడ్ లో స‌త్తా చాటింది మాత్రం ప్రియాంక చోప్రానే. గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ అన్న‌ది ఆమెకి మాత్ర‌మే సాధ్యమైంది. దీపికా ప‌దుకొణే కూడా హాలీవుడ్ లో సినిమాలు చేసింది.

కానీ అక్క‌డ మాత్రం బిజీ కాలేదు. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ హోదాలో కొన‌సాగుతుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అవార్డులు..రివార్డులు..హాలీవుడ్ అవ‌కాశాల ప‌ట్ల దీపికా ప‌దుకొణే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 'న‌టించిన సినిమాలు విజ‌యం సాధించాలి. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాలి. అవార్డులు అందుకోవాలి. అక్క‌డ నుంచి హాలీవుడ్ అవ‌కాశాలు రావాలి. అక్క‌డా స‌క్స‌స్ అవ్వాలి. మంచి స్థాయిలో ఉండాలి అని అంతా కోరుకుంటారు.

Read more!

కానీ నా దృష్టిలో ఇలాంటి వాటిని ప‌ట్టించుకోను. ఒక మంచి వ్య‌క్తిగా ఉండ‌టం కంటే నాకేది ముఖ్యం కాదంటాను. మంచి వ్య‌క్తుల‌తో స‌మ‌యం గ‌డ‌పడం...సెట్ లో అనుభ‌వాలు మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాలుగా మిగుల్చుకోవాలి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో కూడా నేను అంద‌రిలాగే ఆలోచించే దాన్ని కాదు. కానీ స‌క్సెస్ అయిన త‌ర్వాత ఇవ‌న్నీ ఏంటి? మంచిగా ఉండ‌టం కంటే మ‌నిషికి కావాల్సింది ఏముంటుంది? అనిపించింది. స‌క్సెస్ అయ్యాను కాబ‌ట్టి ఈ మాట చెప్ప‌లేదు.

సక్సస్ కాక‌పోయినా ఓ ఏజ్ వ‌చ్చేస‌రికి ఇదే వాస్తవం అని న‌మ్మేదాన్ని ' అని అన్నారు. దీపికా ప‌దుకొణే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీ కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మోడ‌లింగ్ నుంచి న‌టిగా ట‌ర్నింగ్ తీసుకుని నేడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ర‌ణ‌వీర్ సింగ్ ని ప్రేమించి వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోనూ సంతోషంగా ఉంది.

Tags:    

Similar News