• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  1000 కోట్ల హీరోయిన్.....

1000 కోట్ల హీరోయిన్.. అస్సలు తగ్గట్లే..

| బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకునే రీసెంట్ గా పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-10-06 10:30 GMT

బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకునే రీసెంట్ గా పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె కూతురు ఆలనా పాలనా చూసుకోవడంలో బిజీగా ఉంది. ఇప్పట్లో ఆమె సినిమాలకి టైం కేటాయించే అవకాశం లేదు. మరో ఏడాది వరకు కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోబోతోంది. తరువాత మరల పెండింగ్ ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టనుంది. వీటిలో మేజర్ మూవీగా ‘కల్కి పార్ట్ 2’ ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

‘కల్కి 2898ఏడీ’ దీపికా పదుకునే ఫస్ట్ తెలుగు మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో ఆమె కల్కికి జన్మనివ్వబోయే సుమతి పాత్రలో నటించింది. ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 1150 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది దీపికా పదుకునే ఫైటర్, కల్కి 2898ఏడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ లో ఆమె నటించిన సింగం అగైన్ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే మెయిన్ లీడ్ గా చేశారు.

ఈ సింగం అగైన్ సినిమాతో దీపికా పదుకునే రేర్ ఫీట్ అందుకోబోతోంది. ఈ ఏడాది ఈ మూడు సినిమాలతో ఇండియన్ లో 1000 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాలలో నటించిన కథానాయికగా మారబోతోంది. గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్ల క్లబ్ లో దీపికా ఇప్పటికే ఒకసారి చేరింది. మరల ఈ ఏడాది రిలీజ్ అయిన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ 205 కోట్ల కలెక్షన్స్ ని ఇండియాలో అందుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ డిజాస్టర్ గా నిలిచింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ 650 కోట్ల కలెక్షన్స్ ని ఇండియాలో వసూళ్లు చేసింది. ఈ రెండు సినిమాలు మొత్తం కలెక్షన్స్ 805+ కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ లో రిలీజ్ కానున్న సింగం అగైన్ మూవీ ఇండియాలో కనీసం 300+ కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ లో 1000 కోట్లు కలెక్షన్స్ లో రెండో సారి భాగమైన హీరోయిన్ గా దీపికా పదుకునే నిలుస్తుంది.

ఇప్పటి వరకు ఇలా రెండు సార్లు 1000+ కోట్లకి వసూళ్లు అందుకున్న హీరోయిన్స్ ఇండియాలో ఎవరు లేరు. అందుకే దీపికా పదుకునేకి 2023, 2024 సంవత్సరాలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మరల కల్కి పార్ట్ 2 మూవీ 2026 లేదా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కల్కితో మరోసారి దీపికా పదుకునే 1000 కోట్ల కలెక్షన్స్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    
  • Deepikapadukone 
  • Fightermovie 
  • Singhamagain 
  • Kalki2898ad 
  • Bollywood 
  • Deepikapadukonemovies 
  • Filmindustry 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS