స్టార్ హీరో ధీనస్థితి... 'దుప్పటి' కోసం వేడుకోలు
దర్శన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు విచారణకు హాజరు అయ్యాడు. ఆ సమయంలోనే జడ్జికి దర్శన్ ఒక విజ్ఞప్తి చేశాడు.;
కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం అత్యంత ధీన స్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలు, హిట్స్, కోట్లు, కార్లు, విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, ప్రేమ వ్యవహారాలు, పార్టీలు అంటూ లైఫ్ ను లీడ్ చేశాడు. కట్ చేస్తే ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన జైల్లో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. దర్శన్ తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. తనను అమితంగా అభిమానించే ఫ్యాన్‌ను అత్యంత క్రూరంగా హత్య చేయించడంతో దర్శన్ ను చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీసులు సైతం అతడు బయటకు రాకుండా అన్నట్లుగా కేసును చాలా స్ట్రాంగ్‌గా వేయడం జరిగింది. ప్రస్తుతం కేసు కోర్ట్‌లో విచారణ జరుగుతోంది. త్వరలోనే దర్శన్ కు కోర్టు కఠిన శిక్షను విధించే అవకాశాలు ఉన్నాయని బెంగళూరు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలులో...
దర్శన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు విచారణకు హాజరు అయ్యాడు. ఆ సమయంలోనే జడ్జికి దర్శన్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఏంటంటే... చలి బాగా పెరిగింది, ఆ చలికి తట్టుకోలేక పోతున్నాను. అదనపు దుప్పటి ఇవ్వాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేస్తే వారు పట్టించుకోవడం లేదు, దయచేసి మీరు అయినా అదనపు దుప్పటి ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించండి అంటూ జడ్జి ముందు వేడుకున్నాడట. జడ్జ్ అందుకు ఒప్పుకున్నారట. ప్రస్తుతం దర్శన్ పరిస్థితికి ఈ వేడుకోలు అద్దం పడుతోంది. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో, సూపర్ స్టార్ ఇమేజ్ తో ఏ స్థాయిలో లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి స్టార్ ఇప్పుడు చలికి తట్టుకోలేక ఒక దుప్పటి కోసం వేడుకోవడం, దాన్ని జైలు అధికారులు తిరస్కరించడం, దాంతో జడ్జి ముందు మరోసారి ఆయన వేడుకోవడం వంటివి ఆయన ఫ్యాన్స్‌ను కలచి వేస్తున్నాయి.
జడ్జ్ ముందు హీరో దర్శన్ ఆవేదన
కన్నడంలోనే కాకుండా సౌత్‌లో అన్ని భాషల్లోనూ దర్శన్‌కి సినిమాల ద్వారా గుర్తింపు ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండి, వరుస విజయాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా దూసుకు పోతున్న సమయంలో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత హత్య వ్యవహారం కారణంగా ఆయన కెరీర్ మొత్తం నాశనం అయింది. ఆయన సినిమాలు కొన్ని మధ్యలో ఉన్నాయి. అరెస్ట్ సమయంలో చివరి దశలో ఉన్న సినిమాలను ఆ మధ్య బెయిల్ పై వచ్చి కంప్లీట్ చేశాడు అని కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తానికి దర్శన్ అరెస్ట్ కావడంతో చాలా మంది నిర్మాతలు నష్టపోయారు అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దర్శన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.
కన్నడ మీడియాలో దర్శన్ గురించి..
ఆ మధ్య జైలులో ఉన్నప్పటికీ దర్శన్‌కి హీరోగా బయట అనుభవిస్తున్న వసతులు అందుతున్నాయి అంటూ సాక్ష్యాలతో సహా కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో జైలులో దర్శన్ కి అత్యంత గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సాధారణ ఖైదీల మాదిరిగానే ఆయన్ను ఇప్పుడు జైలు అధికారులు చూస్తున్నారు. చిన్న ప్రత్యేక వసతి కూడా ఆయనకు అదనంగా ఇవ్వడం లేదట. దాంతో చలికి తట్టుకోలేక అదనపు దుప్పటి కోసం ఏకంగా జడ్జీని దర్శన్ అడగాల్సి వచ్చింది. సాధారణంగా జైలులో ఉండే సెలబ్రిటీ ఖైదీలకు ప్రత్యేక వసతులు ఉంటాయి అంటారు. కానీ దర్శన్ విషయంలో అలా జరగడం లేదని తాజా ఘటనతో వెళ్లడి అయింది. ఆయన చేసిన పాపం చిన్నది కాదని, అందుకే ఈ స్థాయిలో శిక్షను అనుభవిస్తున్నాడు అని చాలా మంది విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.