విడాకుల తర్వాత నిహారికకి కలిసొచ్చిందా.. తండ్రికి తగ్గ తనయ!
ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీల విషయంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీల విషయంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో నాగచైతన్య, అఖిల్ అక్కినేని, సమంత లాంటి సెలబ్రిటీలు వివాహం తర్వాత మంచి సక్సెస్ ను అందుకొని దూసుకుపోతుంటే.. మరికొంతమంది తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చిన తర్వాత మరింత జోరు పెంచారు. అలాంటి వారిలో నిహారిక కూడా ఒకరు. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నా.. ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగలగా.. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్న మెగా డాటర్ ఇప్పుడు రెట్టింపు వేగంతో దూసుకొచ్చి ఏకంగా నేషనల్ అవార్డును అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇటీవల జూలై 18వ తేదీన న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఏకంగా రెండు నేషనల్ అవార్డులు లభించాయి .ఒకటి ఉత్తమ ప్రాంతీయ చిత్రం కాగా.. మరొకటి బెస్ట్ మేకప్ విభాగంలో నేషనల్ అవార్డులు లభించడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ నిహారికపై అలాగే కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే ఇదే సమయంలో నాగబాబుకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 38 ఏళ్ల తర్వాత తండ్రి రికార్డును నిహారిక రీ క్రియేట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. 1988లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే బాలచందర్ దర్శకత్వం వహించిన రుద్రవీణ చిత్రాన్ని.. నిర్మాతగా నాగబాబు నిర్మించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ ఏకంగా నేషనల్ అవార్డులను అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం మూడు విభాగాలలో నేషనల్ అవార్డును అందుకుంది.
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం కేటగిరీలో నర్గీస్ దత్ అవార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా. అంతే కాదు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఇళయరాజా కి అవార్డు లభించగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు విభాగంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంకి నేషనల్ అవార్డు లభించింది.
అలా నాగబాబు నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రానికి ఎలా అయితే నేషనల్ అవార్డు వచ్చిందో.. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత నిహారిక నిర్మించిన మొదటి సినిమాకి కూడా నేషనల్ అవార్డు రావడం ప్రశంసనీయం. అప్పుడు 36వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నాగబాబుకి నేషనల్ అవార్డు లభిస్తే.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నిహారికకి నేషనల్ అవార్డు లభించడం గమనార్హం. మొత్తానికి అయితే తండ్రికి తగ్గ తనయగా పేరు సొంతం చేసుకుంది నిహారిక. మరోవైపు వరుస సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో విడాకుల తర్వాత నిహారికకు బాగా కలిసొచ్చింది అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మరొకవైపు ఈ సినిమా రెండు నేషనల్ అవార్డులు అందుకున్న నేపథ్యంలో కమిటీ కుర్రోళ్లు టీం స్పెషల్గా ఒక ఈవెంట్ నిర్వహించింది. అందులో చిరంజీవి.. నేషనల్ అవార్డు లిస్ట్ ప్రకటించిన తర్వాత నిహారికతో అన్న మాటలను ఆమె పంచుకున్నారు. నేషనల్ అవార్డు లిస్టు ప్రకటించగానే నేను నేరుగా పెద్ద డాడీ (చిరంజీవి)దగ్గరికి వెళ్లాను. ఆయన నన్ను చూసి.. ఒకప్పుడు మీ నాన్న ఇలాగే నేషనల్ అవార్డు అందుకున్నారు. మళ్ళీ 38 ఏళ్ల తర్వాత నువ్వు నేషనల్ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది అంటూ చెప్పారు. నేనే ఇండస్ట్రీకి ఆయన తోపు అనుకుంటాను. అలాంటిది ఆ తోపే నన్ను తోపు అంటుంటే ఇక ఇండస్ట్రీకి నేనే తోపు అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ క్రేజీ కామెంట్లు చేసింది.