• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న‌టుడి స‌డెన్ డెథ్.....

న‌టుడి స‌డెన్ డెథ్.. ఊహించ‌ని ఫ్యాన్స్ షాక్‌లో!

| చోయ్ జంగ్ వూ ఎవరు? అన్న‌ది ఆరా తీస్తే, 1957లో జన్మించిన చోయ్ జంగ్ వూ ప‌లు కొరియన్ షోలలో తన సహాయక పాత్రలతో పాపుల‌ర‌య్యారు.

By - Tupaki Desk
Update: 2025-05-27 18:57 GMT

సిటీ హంటర్, డాక్టర్ స్ట్రేంజర్, ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ వంటి ప‌లు హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణ కొరియా నటుడు చోయ్ జంగ్ వూ మరణించారని స్థానిక మీడియాలు ధృవీకరించాయి. కొరియా-బూ మీడియా అందించిన వివ‌రాల‌ ప్రకారం.. ఆయన వయసు 68. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు.

చోయ్ జంగ్ వూ ఎవరు? అన్న‌ది ఆరా తీస్తే, 1957లో జన్మించిన చోయ్ జంగ్ వూ ప‌లు కొరియన్ షోలలో తన సహాయక పాత్రలతో పాపుల‌ర‌య్యారు. 1975లో `ది లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్` అనే నాటకంతో న‌టుడిగా అరంగేట్రం చేశారు. ఆయన తన నటనా జీవితాన్ని థియేటర్‌లో ప్రారంభించారు. షిన్సీ వంటి కంపెనీలలో డ్రామా ఆర్టిస్టుగా పనిచేశారు. రంగస్థల నటనతో పాటు అత‌డి ప్ర‌యోగాత్మ‌క శైలి ప్రేక్ష‌కుల‌కు ఇష్టం. అత‌డు ప్ర‌తిభావంతుడైన వాయిస్ ఆర్టిస్టు కూడా.

గాడ్స్ క్విజ్, టూ కాప్స్, పబ్లిక్ ఎనిమీ 2, సింపతీ ఫర్ లేడీ వెంజియన్స్, ది చేజర్, బ్రిలియంట్ లెగసీ, ప్రాసిక్యూటర్ ప్రిన్సెస్, గుమిహో: టేల్ ఆఫ్ ది ఫాక్స్ చైల్డ్, మిడాస్, మై డాటర్ సియో యంగ్, మాస్టర్స్ సన్, కాల్ ఇట్ లవ్, టైరెంట్, హూ ఈజ్ షీ! , ది టేల్ ఆఫ్ లేడీ ఓకే వంటి కె-డ్రామాల్లో నటించాడు. లీ మిన్ హో - సిటీ హంటర్ , ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ వంటి కె-డ్రామాల్లో నటించి చాలా పేరు తెచ్చుకున్నాడు. లీ జోంగ్ సుక్ నటించిన డాక్టర్ స్ట్రేంజర్ చిత్రాలలో కూడా భాగమ‌య్యాడు. చోయ్ జంగ్ వూ అంత్యక్రియల వివ‌రాల‌కు వ‌స్తే, ఈ అంత్యక్రియలు గింపో వూరి హాస్పిటల్ ఫ్యూనరల్ హోమ్‌లో జరుగుతాయ‌ని తెలిపారు. అంతిమ యాత్ర ఊరేగింపు మే 29న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

Tags:    
  • ChoiJungWoo 
  • SouthKoreanActor 
  • CityHunter 
  • DoctorStranger 
  • KDrama 
  • KoreanCinema 
  • EntertainmentNews 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS