చిరంజీవి సినిమాలో దీపిక పదుకొణే!
మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడిక్ భారీ యాక్షన్ థ్రిల్లర్. మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి నట విశ్వరూపం మళ్లీ ఈ సినిమాలో కనిపించబోతుంది? అన్న అంచనాలున్నాయి. ఈ పాత్రకు సంబంధించి చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేయాల్సి ఉంది. అనీల్ రావిపూడితో చేస్తోన్న 157వ సినిమా తర్వాత చిరంజీవి 158 పనుల్లో నిమగ్న మవుతారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చింది. చిరు వయసుకు రాణీ పర్పెక్ట్ గా సూటవుతుందని భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే రాణీ ముఖర్జీ కంటే ఆ పాత్రకు బాలీవుడ్ సంచలనం దీపికా పదుకొణే అయితే బాగుంటుందనే కొత్త ప్రపోజల్ తెరపైకి వస్తుంది. దీపిక అయితే పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్.
`కల్కి 2898` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అన్నింటిని మంచి సౌత్ లోనూ ఫాలోయింగ్ ఉన్న నటి దీపిక. ఈ నేపథ్యంలో మేకర్స్ దీపికను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారుట. సినిమాలో సెకెండ్ లీడ్ కూడా ఉందంటున్నారు. ఆ పాత్రకు రాణీ ముఖర్జీని పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. మెగాస్టార్ లాంటి లెజెండ్ తో కలిసి పనిచేయాలని ప్రతీ నటి కోరుకుంటుంది. అయితే వయసు రీత్యా కొన్ని అడ్డం కులు కూడా ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం అన్నది అంత తేలిగ్గా జరగలేదు. ప్రస్తుతం 157వ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే తర్జన భర్జన కొనసాగుతుంది. నయనతారను అడిగితే ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోంది. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాజల్, తమన్నాలాంటి వాళ్లను తీసుకున్నా? వాళ్లు అంతగా కలిసిరారు.