రావిపూడి కోసం చిరు స్పెషల్ సర్ ప్రైజ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల గ్యాప్ తో రెండు చిత్రాలతో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. ఆ తర్వాత వేసవిలో విశ్వంభర సినిమాతో వస్తున్నారు.
నిజానికి విశ్వంభర మూవీనే ముందు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడుతూ ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతుందని సమాచారం. సమ్మర్ కానుకగానే మూవీ రిలీజ్ కానుందని చిరు స్వయంగా ఇటీవల వెల్లడించారు. ఈసారి తనదే హామీ అని కూడా అన్నారు.
ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీని మెగాస్టార్ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. రావిపూడి కామెడీ మార్క్ క్లియర్ గా ఉండనుందని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది.
చిరు యాక్టింగ్.. రావిపూడి డైరెక్టింగ్.. రెండు కరెక్ట్ గా సెట్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అయితే రీసెంట్ గా అనిల్ పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సెట్స్ లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన తీరు, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేశాయని చిరంజీవి కొనియాడారు. అంతే కాదు.. లగ్జరీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఇప్పుడేం విషెస్ అనుకుంటున్నారా.. నేడు అనిల్ రావిపూడి బర్త్ డే. దీంతో ఆయనతో దిగిన పిక్ ను చిరు పోస్ట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే చిరు ఇప్పుడు వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడం.. సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరి దృష్టిని కూడా ఆకర్షించింది.
నిజానికి.. చిరంజీవి ఎప్పటికప్పుడు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు సర్ప్రైజులు ఇస్తూనే ఉంటారు. దాదాపు తనకు హిట్ ఇచ్చిన వారికి కచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తారు. ఇప్పటికే పలువురికి అలా చేశారు. స్పెషల్ వాచెస్ అందించారు. ఇప్పుడు అనిల్ రావిపూడికి కూడా మంచి వాచ్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మూవీ రిలీజ్ కు ముందే గిఫ్ట్ ఇచ్చి పుట్టిన రోజు నాడు అనిల్ ను ఖుషీ చేశారు చిరు. మరి మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో.. ఎంతటి సర్ప్రైజ్ చేస్తారో వేచి చూడాలి.