మన శంకరవరప్రసాద్ గారు.. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాపై, ఫ్యామిలీ ఆడియెన్స్ లో గట్టి అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2025-10-13 08:16 GMT

తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాపై, ఫ్యామిలీ ఆడియెన్స్ లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిని పాత రోజుల్లోని ఎంటర్‌టైన్‌మెంట్ స్టైల్‌లో చూసే అవకాశం దొరకడంతో, ఈ సినిమా బాక్సాఫీస్‌కు తిరుగుండదని అందరూ భావిస్తున్నారు.

ఈ అంచనాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఆల్రెడీ ఉంది. చిరంజీవిని మళ్లీ పక్కా ఎంటర్‌టైనర్‌గా చూసి చాలా కాలం కావడంతో, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో గట్టిగా వర్కౌట్ అవుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసులో గట్టిగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

ఇందుకు తగ్గట్టుగానే, ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులే ఏకంగా 100 కోట్లకి పైగానే కోట్ చేస్తున్నట్టు టాక్. అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి 270 కోట్ల గ్రాస్ సాధించిన నేపథ్యంలో, చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకు సొంత గడ్డపై 100 కోట్ల టార్గెట్ అనేది ఊహించిందే.

అనిల్ రావిపూడి అంటేనే కామెడీ టైమింగ్ మాస్ ఎలివేషన్స్‌ను బ్యాలెన్స్ చేయగల సత్తా. అలాంటి అనిల్, చిరంజీవి ఎనర్జీని వాడుకుంటూ, ఈ సినిమాలో చాలానే సర్ప్రైజ్‌లు ప్లాన్ చేశారని టాక్. అలాగే వెంకటేష్ కూడా ఓ రోల్ లో కనిపించనున్నారు. దీంతో పండగ సీజన్‌లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు తిరుగుండదని నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే ఈ రూ.100 కోట్ల కోట్ అనేది ఒక సేఫ్ టార్గెట్ లాంటిదే.

సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, ఈ టార్గెట్‌ను ఈజీగా అధిగమించే ఛాన్స్ ఉంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికి, 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా కేవలం ఒక రిలీజ్ మాత్రమే కాదు, చిరంజీవి కమ్‌బ్యాక్‌కు అనిల్ రావిపూడి మార్క్‌కు ఒక పెద్ద టెస్ట్‌గా నిలవనుంది. సంక్రాంతికి ఈ ఎంటర్‌టైనర్ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News