మోహన్ బాబు నచ్చడు.. కానీ : బ్రహ్మానందం
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక నేడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెన్షన్ లో జరిగింది. ఈవెంట్ లో కన్నప్ప సినిమాలో పాల్గొన్న నటీనటులు పాల్గొన్నారు. కన్నప్ప సినిమాలో నటించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా చేయాలని అనుకుంటే జరిగేది కాదని ఆ శివుడే మోహన్ బాబుని పిలిచి తీయమని చెప్పాడని అన్నారు బ్రహ్మానందం.
మోహన్ బాబు అంతకుముందు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. అదంతా శివుడి వల్లే జరిగిందని అన్నారు. ఇప్పుడు జనాల్లో తగ్గిపోయిన భక్తి తత్వాన్ని శివతత్వాన్ని అందరికీ తెలియచేసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు బ్రహ్మానందం.
ప్రస్తుతం కలియుగ ప్రభావం వల్ల మనుషులంతా పరమ దుర్మార్గమైన ఆలోచనలతో ఉంటున్నాడు. అలాంటి వారికి భక్తి అంటే ఏంటని తెలియచెప్పేలా చేయడం కోసమే ఈ సినిమా తీశారని అన్నారు. మోహన్ బాబు ఏం చేసినా మీరు వదిలేయండి.. ఆయన్ను విమర్శించండి.. ఆయన నటనని విమర్శించండి.. ట్రోల్ చేయండి తప్పులేదు. కానీ భక్తి కోసం శివతత్వం తెలియపరచడం కోసం చేసిన ఈ సినిమాను మాత్రం ట్రోల్ చేయకండని అన్నారు. అందరినీ నమ్రతతో నమస్కరించి చెబుతుంది ఏంటంటే ఈ సినిమా ఆదరించండి.. అభిమానించండి కానీ అల్లరి మాత్రం చేయకండని అన్నారు బ్రహ్మానందం.
శివుడు ప్రతి ఇంటా చేరాలి ప్రతి గుండెని చేరాలని ఈ సినిమా తీశారని బ్రహ్మానందం అన్నారు. ఈ సందర్భంగా దూర్జటి గురించి ప్రస్తావించారు. శివలీల గురించి ఆయన మాటల్లో చెప్పారు బ్రహ్మానందం. శివుడి మీద చేసిన సినిమా ఈవెంట్ కాబట్టి బ్రహ్మానందం ఈరోజు వేషధారణ కూడా అంతే సంప్రదాయ బద్ధంగా వేసుకుని వచ్చారు.
ఇక బ్రహ్మానందం స్పీచ్ ఇవ్వకముందే సుమ వెళ్లి మోహన్ బాబు గారి సినిమాల్లో మీరు చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారని అడగ్గా.. అసెంబ్లీ రౌడీ అని అన్నారు. ఆ సినిమా కథ ముందు నా దగ్గరకే వచ్చింది కాకపోతే మోహన్ బాబు వచ్చి నన్ను అడిగాడు అందుకే ఇచ్చేశా అన్నారు. ఇదే క్రమంలో మోహన్ బాబు గారిలో నచ్చే విషయం.. నచ్చనిది అంటే అసలు మోహన్ బాబు అంటేనే నచ్చడు అంటూ సరదాగా మాట్లాడారు బ్రహ్మానందం.