లెనిన్ భాగ్యశ్రీ ప్లస్ అవుతుందా..?

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్.;

Update: 2025-12-04 05:04 GMT

టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్. తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నెక్స్ట్ కింగ్ డమ్, కాంత రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేసింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రిజల్ట్ భాగ్య శ్రీని సంతృప్తి పరచిందనే చెప్పొచ్చు. తన సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం భాగ్యానికి మంచి సంతోషాన్ని ఇచ్చినట్టు ఉంది. అఫ్కోర్స్ ఆంధ్రా కింగ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నా సినిమాతో భాగ్య శ్రీ వర్క్ సాటిస్ఫ్యాక్టరీగానే అనిపించింది.

శ్రీలీల ప్లేస్ లో భాగ్య శ్రీ ఎంట్రీ..

రామ్ తో ఆమె జోడీ కూడా ఆకట్టుకుంది. ఐతే ఈ సినిమా తర్వాత భాగ్య శ్రీ బోర్స్ అక్కినేని హీరో అఖిల్ తో లెనిన్ సినిమాలో నటిస్తుంది. లెనిన్ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో ముందు అఖిల్ సరసన శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో శ్రీలీల ప్లేస్ లో భాగ్య శ్రీ ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో కింగ్ డం సినిమా చేసిన భాగ్య శ్రీ మళ్లీ అదే బ్యానర్ లో వస్తున్న లెనిన్ కి సెలెక్ట్ అయ్యింది.

లెనిన్ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని నాగార్జున కూడా సహ నిర్మాతగా ఉన్నారు. అఖిల్ లెనిన్ కి భాగ్య శ్రీ ఎంతవరకు ప్లస్ అవుతుందా అన్న డిస్కషన్ మొదలైంది. లెనిన్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన అందులో శ్రీలీల హీరోయిన్ గా కనిపించింది. సో భాగ్య శ్రీతో కొత్త టీజర్ లేదా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ వదలాల్సి ఉంది. అఖిల్ తో భాగ్య శ్రీ జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఆంధ్రా కింగ్ ఇచ్చిన పుష్ తో..

భాగ్య శ్రీ కూడా లెనిన్ తో మరోసారి ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. స్టార్ మెటీరియల్ అయిన అమ్మడు సరైన హిట్ పడితే టాప్ చెయిర్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ తీసిన సినిమాలేవి అమ్మడికి సాలిడ్ హిట్ ఇవ్వలేదు. మరి లెనిన్ తో అయినా భాగ్య శ్రీకి లక్ కలిసి వస్తుందేమో చూడాలి.

లెనిన్ సినిమా అసలైతే నవంబర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎందుకో సినిమా రిలీజ్ కాలేదు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ మొదలు పెట్టలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ లెనిన్ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ఉంటుందట. మరి సినిమాతో అమ్మడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. లెనిన్ తర్వాత భాగ్య శ్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఐతే ఆంధ్రా కింగ్ ఇచ్చిన పుష్ తో అమ్మడు కెరీర్ ని మరింత క్రేజీగా మార్చుకోవాలని చూస్తుంది.

Tags:    

Similar News