సినిమా ఫెయిల్ అయితే తప్పంతా హీరోయిన్ దేనా.. భాగ్యశ్రీ సంచలన కామెంట్స్!

సినిమా సక్సెస్ అనేది నటీనటుల పర్ఫామెన్స్ , కథ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

Update: 2026-07-20 05:45 GMT

సినిమా సక్సెస్ అనేది నటీనటుల పర్ఫామెన్స్ , కథ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక్కొక్కసారి సినిమాలో కథ లేకపోయినా, మ్యూజిక్ పరంగా కూడా మంచి విజయం అందుకున్న చిత్రాలు ఉన్నాయి. ఇంకొక వైపు హీరో తన భుజాల మీద సినిమాను మోసుకొస్తూ సక్సెస్ అందుకుంటే.. మరొకవైపు హీరోయిన్ కూడా సినిమా సక్సెస్ లో భాగమవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సక్సెస్ అయ్యింది అంటే.. ఆ క్రెడిట్ మొత్తం హీరో లేదా ఆ చిత్ర దర్శకుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అదే సినిమా డిజాస్టర్ గా నిలిచింది అంటే మాత్రం హీరోయిన్ నటనపైనే విమర్శలు గుప్పిస్తారు. అంతేకాదు ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే ఆ సినిమా హీరోయిన్ వల్లే డిజాస్టర్ అయ్యిందనే నిందలు కూడా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో హీరోయిన్స్ మోస్తున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది.

ముఖ్యంగా రమ్యకృష్ణ, రోజా ఇలా నాటితరం హీరోయిన్లను మొదలుకొని.. ఆ తర్వాత తరం వచ్చిన శృతిహాసన్, పూజా హెగ్డే, ఇటీవల వచ్చిన శ్రీలీలా, కృతి శెట్టి లాంటి ఎంతోమంది హీరోయిన్స్ ఐరన్ లెగ్ అనే ముద్ర మోయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి అంటే ఇక ఆ హీరోయిన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్నారు. అయితే అదే సమయంలో హీరోలు వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నా సరే వారిపై పడని ముద్ర.. హీరోయిన్లకే ఎందుకు అంటూ తనదైన శైలిలో ప్రశ్నించింది భాగ్యశ్రీ

ఇకపోతే ఇటీవల లెనిన్ చిత్రంతో తన కెరియర్ లో ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న ఈమె.. మునుపటి చిత్రాలన్నీ ఫ్లాప్ అవడంతో ఒకప్పుడు తెలుగు మీడియా కూడా ఈమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పై స్పందించింది. "ఐరన్ లెగ్ అనే ట్యాగ్ నాపై వేసినందుకు నేను ఏ రోజు కూడా బాధపడలేదు. కానీ దానికి అసలైన అర్థం తెలియకపోవడంతో ఏర్పడిన గందరగోళం నన్ను బాదించింది" అంటూ ఆమె చెప్పుకొచ్చింది. "స్క్రిప్ట్ లో మార్పులు, ఎడిటింగ్ లో నిర్ణయాలు, సినిమా నిర్మాణంలోని ఇతర సృజనాత్మక అంశాలపై నటికి ఎలాంటి నియంత్రించే హక్కు లేనప్పుడు.. ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే ఆమెనే ఎందుకు తరచుగా నిందిస్తారు ? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించింది.

అంతేకాదు ఇందుకు ఉదాహరణగా ఆమె పలువురు హీరోయిన్లను వెలికితీస్తూ శృతిహాసన్, తాప్సీ పన్ను, శ్రీ లీలా వంటి ఎంతోమంది నటీమణులు తమ కెరియర్ లో కూడా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నప్పటికీ ..ఇప్పుడు దృఢంగా నిలబడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు కదా.. సినిమా అనేది ఒక సామూహిక కృషి అని , విజయం లేదా అపజయాన్ని కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే ఆపాదించలేమని తన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఆ క్రెడిట్ మొత్తాన్ని హీరోయిన్ కి ఇస్తారా అంటూ కూడా అడిగింది. ఏది ఏమైనా సినిమా ఫ్లాప్ కి కేవలం హీరోయిన్స్ ని మాత్రమే బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈమె చేసిన కామెంట్స్ ఆలోచించదగినవే కదా.. ఇప్పటికైనా ఇండస్ట్రీలో మార్పు వస్తుందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News