ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అవుతున్న మాస్టర్ మైండ్స్!

పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఇద్దరు దర్శకుల పేర్లు మారుమోగిపోతున్నాయి.

Update: 2026-10-21 13:30 GMT

పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఇద్దరు దర్శకుల పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకరు బాలీవుడ్‌కు చెందిన ఆదిత్య ధర్ కాగా.. మరొకరు కోలీవుడ్‌కు చెందిన నెల్సన్ దిలీప్‌కుమార్. ఇటీవల సాధించిన భారీ విజయాలతో ఇద్దరు మేకర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాశారు. దాంతో వారి తదుపరి ప్రాజెక్టులు ఎవరితో ఉంటాయి? ఈ సెన్సేషనల్ డైరెక్టర్లు ఏ ఏ హీరోలతో జతకట్టబోతున్నారు? అనే అంశంపై ఇటు చిత్ర పరిశ్రమలో, అటు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ఇటీవల తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ధురంధర్ 2` సాధించిన అపూర్వ విజయం ఆయన స్థాయిని పెంచేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన కలెక్షన్ల సునామీతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఆయన దర్శకత్వంలో నటించేందుకు క్యూ కడుతున్నారు. శబ్దంతో పనిలేకుండా కేవలం కంటెంట్ .. మేకింగ్ విజన్‌తో వందల కోట్ల బిజినెస్ చేయగలరని నిరూపించిన ఆదిత్య ధర్, తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనేది ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

మరోవైపు కోలీవుడ్‌లో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ హవా ఏమాత్రం తగ్గడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన `జైలర్` సాధించిన సంచలనం తర్వాత దాని సీక్వెల్‌గా వచ్చిన `జైలర్ 2`తో కూడా ఆయన బాక్స్ ఆఫీస్‌ను దున్నేస్తున్నారు. తన మార్క్ డాార్క్ కామెడీ.. హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో వరుసగా బ్లాక్‌బస్టర్లు కొడుతున్న నెల్సన్ సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా నిలిచారు. జైలర్ ఫ్రెంచైజీ సాధించిన అఖండ విజయంతో నెల్సన్ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇద్దరు దర్శకుల సక్సెస్ గ్రాఫ్ చూసిన తర్వాత బడా నిర్మాణ సంస్థలు డేట్స్ కోసం కోట్ల రూపాయిల అడ్వాన్సులు పట్టుకుని కాచుకుని కూర్చున్నాయి. ఆదిత్య ధర్ తదుపరి చిత్రాన్ని కూడా పాన్-ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉండగా.. బాలీవుడ్‌లోని ఓ అగ్ర హీరోతో పాటు సౌత్‌కు చెందిన ఒక స్టార్ హీరో పేరు కూడా ఆయన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. విజన్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో ఆదిత్య ధర్ ప్రాజెక్ట్‌పై నేషనల్ వైడ్ క్రిటిక్స్ దృష్టి నిలిచింది.

నెల్సన్ దిలీప్‌కుమార్ విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఓ మాస్ స్టార్‌తో ఆయన పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని క్రేజీ కాంబినేషన్ల చుట్టూ వార్తలు చక్కర్లు కొడుతున్నా? నెల్సన్ తన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్న మయ్యారు. ఏ హీరోతో పనిచేసినా? తనదైన విలక్షణమైన శైలితో థియేటర్లలో ఈలలు వేయించడం నెల్సన్ ప్రత్యేకం కావడంతో ఈ కాంబినేషన్ ఏదైనా సరే రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మొత్తానికి `ధురంధర్ 2`, `జైలర్ 2` లాంటి భారీ హిట్ల తర్వాత ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు వేసే ప్రతి అడుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తదుపరి సినిమాలతో ఎలాంటి కంటెంట్‌ను ముందుకు తెస్తారు? ఏ హీరోలను నయా లుక్‌లో చూపిస్తారనే? అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు సంచలన దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ ఎలాంటి సునామీ సృష్టిస్తారో? చూడాలని సినీ లోకం అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News