SYG: కంటెంట్ పై నమ్మకం.. మరి రిస్కా? సవాలా?

సినిమాపై నమ్మకం ఉండటం వేరు.. ఆ నమ్మకాన్ని బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం వేరు.

Update: 2026-10-21 19:30 GMT

సినిమాపై నమ్మకం ఉండటం వేరు.. ఆ నమ్మకాన్ని బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం వేరు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమాలకు విడుదల తేదీ కూడా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు (SYG) విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్‌ పై మూవీ టీమ్ కు నమ్మకమున్నా.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్ టాపిక్ గా మారింది.

సాయిదుర్గా తేజ్ కెరీర్‌ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. దర్శకుడు రోహిత్ కేపీ ఆ సినిమాతో పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ గా రూపొందుతున్న ఆ చిత్రం కోసం తేజ్ రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించారు. కొత్త లుక్‌ లో కనిపించేందుకు స్పెషల్ గా రెడీ అయ్యారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.

ముందుగా ప్రకటించిన ప్రకారం 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావాలి. సంక్రాంతి సీజన్‌ లో సినిమాను రిలీజ్ చేయడం ఎంతవరకు కలిసొస్తుందనేది ఇప్పుడు కీలకం. పండగ సెలవులు ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో సినిమాకు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఎక్కువైతే థియేటర్లు, షోల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. సినిమా బాగున్నా సరైన స్థాయిలో థియేటర్లు దక్కకపోతే వసూళ్లపై ప్రభావం పడొచ్చు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన SYGకు ఇది ఇంపార్టెంట్ విషయం.

అందుకే సంక్రాంతి నుంచి తప్పుకోవడం కూడా అంత ఈజీ కాదు. మరో తేదీకి వాయిదా వేసుకుంటే పోటీ తగ్గి ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఉంటుంది. కానీ సోలోగా విడుదల చేసినంత మాత్రాన వసూళ్లు వచ్చేస్తాయనే హామీ లేదు. పండగ సీజన్‌ లో ఉండే ప్రేక్షకుల రద్దీ, హాలీడేస్ బెనిఫిట్ మరో సమయంలో ఉండకపోవచ్చు. ముఖ్యంగా సినిమాకు వచ్చే టాక్ బట్టి పోటీ లేకపోయినా వసూళ్లు ఆశించిన స్థాయికి చేరకపోవచ్చు. చివరకు ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా నిలబడుతుంది.

ఇదే SYG టీమ్‌ కు అదే అసలు టెస్ట్ . సినిమా కంటెంట్‌ పై నమ్మకంతో ప్రకటించిన తేదీకే వస్తే పోటీని తట్టుకోవాలి. మరోవైపు వాయిదా వేసుకుంటే కంటెంట్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అంటే రెండు వేల్లోని రిస్క్ ఉంది. అయితే స్టోరీ, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే పోటీని అధిగమించడం కూడా అసాధ్యం కాదు. అందుకే విడుదల తేదీ కంటే సినిమా కంటెంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో మూవీ టీమ్ ముందు విడుదలకు సంబంధించిన పనులే ఉన్నాయి. సినిమాపై ఉన్న నమ్మకాన్ని వసూళ్లుగా మార్చుకోవాలంటే సరైన టైమ్ ఎంచుకోవడం ముఖ్యం. అయితే విడుదల తేదీ ఛేంజ్ పై ఇప్పటివరకు అనౌన్స్మెంట్ రాలేదు. మరి SYG టీమ్ సంక్రాంతి రిస్క్‌ నే ఎంచుకుంటుందా.. లేక సోలో రిలీజ్ సవాల్‌ కు సిద్ధమవుతుందా? దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News