BO ఫైట్‌కి తండ్రి కొడుకులు రెడీ..!

అన్ని భాషల ఇండస్ట్రీస్‌ నుంచి ప్రతి వారం సినిమాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

Update: 2026-10-21 16:30 GMT

అన్ని భాషల ఇండస్ట్రీస్‌ నుంచి ప్రతి వారం సినిమాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు వారంలో ఒక్క సినిమా మాత్రమే విడుదలైతే కొన్ని సార్లు వారంలో అయిదు, పది సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఒక వారంలో సినిమాలు విడుదల కాకుండా ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫైట్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు లేదా ఒకే బ్యానర్‌ నుంచి రూపొందిన సినిమాలు ఒకే వారంలో విడుదల కావడం చూస్తూ ఉంటాం. అయితే తండ్రి కొడుకుల సినిమాలు ఒకే వారంలో అది కూడా ఒకే రోజు విడుదల కావడం మనం చూడలేదు. ఈ మధ్య కాలంలో ఏ తండ్రి, కొడుకు సినిమాలు ఒకే రోజు విడుదల కాలేదు. కలిసి నటించిన సినిమాలతో తండ్రి కొడుకులు రావడం చూశాం, కానీ విడివిడిగా నటించిన సినిమాలతో ఒకే రోజు రావడం మాత్రం చూడలేదు.

ఆకాశంలో ఒక తార సినిమాతో...

నవంబర్‌ 20 ఆ అరుదైన ఘట్టంకు వేదిక కాబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 'ఆకాశంలో ఒక తార' సినిమా నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో వచ్చి అంచనాలు పెంచింది. ఒక సాధారణ యువతి ఎలా అంతరిక్షం వరకు వెళ్లింది అనేది కథ. ఈ కథలో ఆ యువతి భర్తగా దుల్కర్‌ సల్మాన్‌ కనిపించబోతున్నాడు. ఆకాశంలో ఒక తార అనే టైటిల్‌తో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ ముఖ్యంగా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో కచ్చితంగా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం. కానీ తమిళ్‌, మలయాళంలో 'ఓం' సినిమా పోటీకి రాబోతున్న కారణంగా కచ్చితంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ధనుష్‌, మమ్ముట్టీల ఓం సినిమా...

ధనుష్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఓం సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళంలో ఓం సినిమాను మమ్ముట్టీ సినిమాగానే ప్రమోట్‌ చేస్తున్నారు. అందుకే ఓం సినిమాకు అక్కడ కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మెగాస్టార్‌ మమ్ముట్టీ సినిమా అనగానే మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓం సినిమాకు మలయాళంలో కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక ధనుష్ సినిమా కావడంతో తమిళనాట ఓం సినిమా మినిమం గ్యారెంటీ హిట్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కనుక తమిళనాడు, కేరళలో ఓం సినిమా కచ్చితంగా సాలిడ్‌ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓం ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది చూడాలి.

మమ్ముట్టీ వర్సెస్ దుల్కర్‌ సల్మాన్‌ సినిమాలు...

బాక్సాఫీస్ వద్ద బిగ్‌ ఫైట్‌ కి ఓం తో మమ్ముట్టీ, ఆకాశంలో ఒక తార సినిమాతో దుల్కర్‌ సల్మాన్‌ రెడీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్‌ బజ్ క్రియేట్ అయింది. ఒకే రోజు విడుదల వల్ల కచ్చితంగా రెండు సినిమాలకు బాక్సాఫీస్‌ వద్ద ఎంతో కొంత నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తండ్రి కొడుకుల సినిమాలను ఒకే రోజు విడుదల చేయాలని ప్లాన్‌ చేసిన నిర్మాతలకు మమ్ముట్టీ, దుల్కర్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి ఈ రెండు సినిమాల విడుదల వల్ల ఫ్యాన్స్ కు భారం అని కూడా కొందరు అంటున్నారు. రెండు సినిమాల ఓపెనింగ్స్ హోరా హోరీగా ఉండనున్నాయి. అయితే లాంగ్ రన్‌లో మాత్రం కంటెంట్‌ ఆధారంగానే సినిమాలు నడుస్తాయి. కనుక ఓం, ఆకాశంలో ఒక తార సినిమాల ఫలితాలు వాటి కంటెంట్‌ పై ఆధారపడి ఉంటాయి. ధనుష్ మూవీ అంటే మంచి కంటెంట్ ఓరియంటెడ్‌ అంటారు. ఇక దుల్కర్‌ సైతం మంచి సబ్జెక్ట్‌ ను ఎంపిక చేసుకుని చేస్తాడు. కనుక ఈ తండ్రి కొడుకుల బాక్సాఫీస్ ఫైట్‌ లో ఎవరిది పై చేయి అవుతుంది అనేది చూడాలంటే నవంబర్‌ 20 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News