బోల్డ్ సీన్లు అల్లాటప్పా కాదు: బాలీవుడ్లో కొత్త శకం.. ఇంటిమసీ కోఆర్డినేటర్ల వ్యవస్థ!
ఒకప్పుడు శృంగారం.. ముద్దు సన్నివేశాలను రెండు పువ్వులు ఒకదానికొకటి తాకడం ద్వారా లేదా అలల హోరు, మంటల వెలుగులతో ప్రతీకాత్మకంగా చూపించేవారు.
ఒకప్పుడు శృంగారం.. ముద్దు సన్నివేశాలను రెండు పువ్వులు ఒకదానికొకటి తాకడం ద్వారా లేదా అలల హోరు, మంటల వెలుగులతో ప్రతీకాత్మకంగా చూపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, కథల్లో బోల్డ్ కంటెంట్ పెరగడంతో నటీనటులు ఆన్-స్క్రీన్ ఇంటీమేట్ సీన్లలో నటించాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సెట్స్‌పై నటీనటుల రక్షణ, వారి సమ్మతి .. ప్రొఫెషనలిజం కోసం బాలీవుడ్ ఇప్పుడు `ఇంటిమసీ కోఆర్డినేటర్ల` సహాయం తీసుకుంటోంది.
గ్లోబల్ స్థాయిలో ఎదురైన #MeToo ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల నివారణ .. సురక్షితమైన పని వాతావరణం ఏర్పాటుపై దృష్టి పెరిగింది. ఒక ఫైట్ సీన్‌ను ఎలాగైతే స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేస్తారో? అలాగే శృంగార సన్నివేశాలను కూడా ఏ స్పర్శ ఎక్కడ ఉండాలి? చేతులు ఎలా కదలాడాలి? అనే అంశాలను ఇంటిమసీ కోఆర్డినేటర్లు పక్కాగా ప్లాన్ చేస్తారు. దీంతో నటీనటుల మధ్య ఎలాంటి ఇబ్బందికరమైన లేదా అనుకోని అసౌకర్య పరిస్థితులు ఎదురుకావు.
ఈ కోఆర్డినేటర్లు షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోడెస్టీ టూల్స్ ఉపయోగించి నటీనటుల మధ్య సురక్షితమైన దూరాన్ని కల్పిస్తారు. క్రాచ్ గార్డ్స్.. నిపుల్ పాస్టీస్ .. డోనట్ కుషన్ల వంటి సామాగ్రిని ఉపయోగించి ఆన్-స్క్రీన్ ఇంటీమేసీని సహజంగా రీక్రియేట్ చేస్తూనే నటీనటుల మధ్య అనవసరమైన శారీరక స్పర్శ లేకుండా చూస్తారు. అలాగే నటీనటులు కాస్టింగ్ దశలోనే ఈ తరహా సన్నివేశాలకు సుముఖంగా ఉన్నారో లేదో ముందే స్పష్టత తెచ్చుకుంటారు.
బాలీవుడ్లో కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన `గెహరాయియాన్` (2022) చిత్రం ఇలాంటి ఇంటిమసీ డైరెక్షన్.. శిక్షణను అధికారికంగా అమలు చేసిన మొదటి ప్రధాన హిందీ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీ సిరీస్‌లు, ప్రాజెక్ట్‌లలో ఈ ధోరణి మరింత పెరిగింది. `మిర్జాపూర్` నటి రసికా దుగల్ తెలిపిన ప్రకారం తొలినాళ్లలో పరిమితులను నటీనటులు సొంతంగా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఇంటిమసీ కోఆర్డినేటర్లు ఉండటం వల్ల ఎవరి హక్కులకు భంగం కలగకుండా సురక్షితంగా నటించగలుగుతున్నారని పేర్కొన్నారు.
గతంలో సెట్స్‌పై దర్శకుడు ..సహ నటులు హద్దులు దాటి ప్రవర్తించడం లేదా అనుకోకుండా కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు జరిగేవని, అలాంటి సంఘటనలు హీరోయిన్ల మనస్సులో చెరిపివేసి గాయాలుగా మిగిలిపోయేవని ప్రసిద్ధ కోఆర్డినేటర్ ఆస్థా ఖన్నా తెలిపారు. తమ పని కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం కాదని, హింస, వేధింపులు, ఆధిపత్యం , నగ్నత్వం ఉన్న సన్నివేశాల్లో కూడా నటీనటులు మానసిక ఆందోళనకు గురికాకుండా కాపాడుతుందని వివరించారు.
ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా కొద్దిమంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నా? రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలన్నీ దీన్ని ఒక నిర్బంధ ప్రమాణంగా మార్చాలని నిపుణులు ఆశిస్తున్నారు. కేవలం పెద్ద హీరోలు లేదా కమర్షియల్ మాస్ చిత్రాల్లో మాత్రమే కాకుండా కథా బలమున్న ప్రతి చిత్రంలో ఇంటిమసీ కోఆర్డినేటర్ల పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ మార్పు భారతీయ సినీ రంగాన్ని ప్రొఫెషనలిజం వైపు నడిపించే గొప్ప పరిణామంగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.