ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ రోజే ఫౌజీ అప్డేట్ !

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి అదిరిపోయే తీపి కబురు అందింది.

Update: 2026-10-21 11:04 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' గురించిన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. తాజాగా 'దొంగ నా కొడుకు' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న హీరో మౌళి.. నిర్మాత మైత్రీ రవిని సరదాగా ఇరుకున పెట్టి ఈ క్రేజీ అప్‌డేట్‌ను రాబట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

మౌళి ప్రశ్నకు నిర్మాత రవిశంకర్ రిప్లై:

'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి మైక్ తీసుకుని మైత్రీ నిర్మాత వై. రవిశంకర్‌ను సరదాగా కార్నర్ చేశారు. ప్రభాస్ గారి ‘ఫౌజీ’ అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు సర్. మీ దగ్గర నుంచి ఆ వివరాలు తెలుసుకోవాలని అడుగుతున్నాను.”అంటూ ఆయన నవ్వులు పూయించారు. ఇక మౌళి అడిగిన ఈ ఫన్నీ ప్రశ్నకు నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ.. ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేలా అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్;

అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన చిన్న వీడియో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రవి అధికారికంగా ప్రకటించారు. ఇక ఇది ఏదో బాహుబలి రేంజ్ భారీ యాక్షన్ కట్ లాంటిది కాకుండా.. సినిమా నేపథ్యం ఏంటి, హీరో పాత్ర స్వభావం ఎలా ఉండబోతోంది, కథ ఏ కాలానికి సంబంధించింది అనే విషయాలను పరిచయం చేసే ఒక పక్కా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండనుందని ఆయన స్పష్టం చేశారు.

రామ్ చరణ్ – సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ డేట్ లీక్: ప్రాజెక్ట్ అప్‌డేట్లతో ఆపకుండా హీరో మౌళి.. రంగస్థలం వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంపై కూడా నిర్మాత రవిశంకర్‌ను ప్రశ్నించారు. ఇక ఈ క్రేజీ కాంబో మూవీ దసరా సందర్భంగా లాంచ్ కావాల్సి ఉండగా, ప్రస్తుతం అశుభ సమయం నడుస్తుండటంతో వాయిదా వేశామని నిర్మాత వివరించారు. అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

థియేటర్లలోనూ ఫౌజీ గ్లింప్స్ ప్రదర్శన:

ఇక ఫౌజీ గ్లింప్స్ డిజిటల్ వీడియో గ్లింప్స్‌ను కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా, మైత్రీ బ్యానర్ రూపొందించి థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాల వెండితెరపై కూడా చూపించనున్నట్లు రవిశంకర్ వెల్లడించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా థియేటర్లలో కూడా ఈ గ్లింప్స్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసే అవకాశం దక్కనుంది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ఇక మొత్తానికి చూస్తే, ప్రభాస్ బర్త్‌డే కానుకగా రాబోతున్న 'ఫౌజీ' గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఇస్తున్న ఈ ట్రీట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Tags:    

Similar News