పెర్ఫెక్ట్ బ్లెండ్.. రెహమాన్ నమ్మకం నిలబెట్టుకున్నట్లే..

కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ బాణీలతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ గొంతుతోనూ మెప్పిస్తారు.

Update: 2026-10-21 07:59 GMT

కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ బాణీలతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ గొంతుతోనూ మెప్పిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ఆ రెండింటిలోనూ మెప్పించారు. సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన ఆయన.. సింగర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో సంగీత దర్శకుడి బాణీకి తన వాయిస్ అందించారు. అది కూడా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతంలో కావడం విశేషం.

దేవిశ్రీ ప్రసాద్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఆయన మ్యూజిక్. ముఖ్యంగా మాస్ సాంగ్స్ కు ఆయన అందించే బీట్స్ ప్రత్యేకంగా ఉంటాయి. అదే సమయంలో తన గొంతుతోనూ ఎన్నో పాటలను హిట్ చేశారు. రంగ్ రంగ రంగస్థలాన, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, బాస్ పార్టీ వంటి పాటల్లో ఆయన వాయిస్‌ లోని ఎనర్జీ కనిపిస్తుంది. పాటకు తగ్గట్టుగా స్పీడ్, జోష్ చూపించడం డీఎస్పీ స్పెషాలిటీ.

అందుకే ఆయన పాట పాడుతున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ రామాయణ మూవీలోని రావణ తాండవం సాంగ్ లోనూ తన గొంతుతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఆ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇందులో యశ్‌పై తెరకెక్కిన రావణ తాండవం సాంగ్ తెలుగు వెర్షన్‌ కు దేవిశ్రీ ప్రసాద్ పాడారు. అయితే ఆ సాంగ్ లో డీఎస్పీ వాయిస్ ఎందుకు స్పెషల్ అంటే.. రావణుడి రోల్ కు ఉండే గంభీరత్వం, ఆవేశం పాటలో కూడా కనిపించాలి. అలాంటి సాంగ్ కు స్ట్రాంగ్ గా, జోష్ గా పాడగల గాయకుడి గొంతు అవసరం. డీఎస్పీ వాయిస్‌ లో ఆ స్త్రెంత్ ఉంది. ఆయన పాటల్లో కనిపించే ఎనర్జీ సాంగ్ కు కూడా కలిసొచ్చింది.

మరోవైపు రెహమాన్ సంగీతం తనదైన శైలిలో సాగుతుంది. ఆ ఇద్దరి టాలెంట్ కలవడంతో పాటకు కొత్త స్పెషాలిటీ వచ్చింది. సంగీతం రెహమాన్‌ ది అయినా.. తెలుగు వెర్షన్‌ లో డీఎస్పీ గొంతు మెయిన్ స్ట్రెంత్ గా నిలుస్తోంది. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంలో రూపొందిన సాంగ్స్ తోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. అయితే ఇతర సంగీత దర్శకుల బాణీల్లోనూ ఆయన గతంలో పాడారు. ఇప్పుడు రెహమాన్ సంగీతంలో మరోసారి పాడారు.

తనకు అలవాటైన మాస్ ఎనర్జీని మరో సంగీత దర్శకుడి బాణీకి జోడించడం ఆయనలోని టాలెంట్ ను చూపిస్తోంది. డీఎస్పీ వాయిస్ లోని స్త్రెంత్, పాటను ముందుకు నడిపించే తీరు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పాట వినేవారిని మెప్పించడంతో అంచనాలు పెరిగాయి. అయితే స్క్రీన్ పై యశ్ యాక్టింగ్ కు డీఎస్పీ గొంతు తోడైనప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నదే ఇంట్రెస్టింగ్. థియేటర్‌ లో ఆ పాట ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి రెహమాన్ నమ్మకంతో డీఎస్పీకి ఇచ్చిన ఆ ఛాన్స్.. ఆ ఇద్దరి కాంబోను నిజంగానే ఒక పెర్ఫెక్ట్ బ్లెండ్‌ గా నిలబెట్టినట్లే కనిపిస్తోంది.

Tags:    

Similar News