నా బాడీ, నా సైజ్‌, నా ఇష్టం...!

పాయల్‌ రాజ్‌పూత్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చర్చనీయాంశం అయ్యాయి.

Update: 2026-10-21 07:41 GMT

పాయల్‌ రాజ్‌పూత్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ ఫోటోలు, వీడియోలకు కొందరు చేసిన నెగిటివ్‌ కామెంట్స్ శృతి మించాయి. ఆమె శరీరాకృతిని గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి ఇంకా చాలా విషయాల గురించి నెగిటివ్‌గా మాట్లాడుతూ చాలా మంది సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పాయల్‌ రాజ్‌పూత్ వీడియోలు, ఆ వీడియోలకు వచ్చిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించే విధంగా చేశాయి. తన గురించి కొందరు చేస్తున్న విమర్శలకు పాయల్‌ ధీటుగా సమాధానం ఇచ్చింది. తన గురించి సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ, ట్రోల్‌ చేసిన వారిని సిగ్గు ఉండాలి అంటూ పరుష పదజాలంతో స్పందిస్తూ కౌంటర్‌ ఇవ్వడంతో పాయల్‌ రాజ్‌పూత్‌ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌...

చాలా మంది హీరోయిన్స్‌ తమను ఎంత ట్రోల్‌ చేసినా, చివరకు బాడీ షేమింగ్‌ చేసినా నోరుమూసుకుని ఉంటున్నారు. దాంతో బాడీ షేమింగ్‌ చేస్తున్న వారు మరింత పేట్రేగి పోతున్నారు. ఇప్పుడు పాయల్‌ రాజ్‌పూత్‌ తన గురించి కామెంట్‌ చేసిన వారికి గట్టి సమాధానం ఇవ్వడంతో కొంత మేరకు అయినా ట్రోల్స్ తగ్గుతాయి. సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్‌ తమ బాడీ గురించి కొందరు చేసే కామెంట్స్ ను ఉపేక్షించవద్దని చాలా మంది అంటున్నారు. ఒక సారి నెగిటివ్‌ ట్రోలింగ్‌, బాడీ షేమింగ్ కామెంట్స్ ప్రారంభం అయితే, ఒకరిని చూసి ఒకరు అన్నట్టు వరుసగా కామెంట్స్ చేసే వారు పెరుగుతూనే ఉంటారు. మొదట్లోనే ఆ ట్రోల్స్ కు గట్టి సమాధానం చెప్తే ఆ తర్వాత ట్రోల్‌ చేయాలి అనుకునే వారు, బాడీ షేమింగ్‌ కు పాల్పడే వారు జాగ్రత్త పడుతారు. ఇప్పుడు పాయల్‌ ఇచ్చిన ఘాటు రిప్లే కి చాలా మంది ఆమెను ట్రోల్‌ చేసేందుకు వెనుకాడుతారు అనడంలో సందేహం లేదు.

పాయల్‌ రాజ్‌పూత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

సోషల్ మీడియా ద్వారా పాయల్‌ రాజ్‌పూత్‌ తనపై వస్తున్న ట్రోల్స్‌కి సమాధానం ఇచ్చింది. ఎక్స్‌లో పాయల్‌ ఒక పోస్ట్‌లో... సిగ్గు పడండి, నా శరీరం, నా సైజు, నా ఇష్టం. నా ఆత్మగౌరవం గురించి మీ చర్చ మీ అభిప్రాయాలు అక్కర్లేదు. మీ సభ్యత ను మర్చిపోయి చేస్తున్న కామెంట్స్ ను హద్దుల్లో పెట్టుకోండి. మీ అభిప్రాయాలను మీ వద్దే పెట్టుకుని హద్దులో ఉండండి. మీ పని మీరు చూసుకోండి అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. పాయల్‌ గురించి బాడీ షేమింగ్‌ చేస్తున్న వారిపై ఆమె అభిమానులు సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెగెటివ్‌ కామెంట్స్ చేసిన వారిపై పాయల్‌ అభిమానులు తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ కౌంటర్‌ ఇచ్చారు. మొత్తానికి పాయల్‌ రాజ్‌ పూత్‌ గత కొన్ని రోజులుగా జరుగుతున్న బాడీ షేమింగ్‌ కు గట్టిగా సమాధానం ఇవ్వడంతో ఇక మీదట ఆమెకు కాస్త ఊరట దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ మూవీతో రానున్న...

ఈ ఏడాది ఒక తమిళ సినిమాతో వచ్చిన పాయల్‌ రాజ్‌పూత్‌ మరో వైపు ఒక పంజాబీ సినిమాను చేస్తోంది. ఇదే ఏడాదిలో ఆ పంజాబీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు తెలుగులోనూ ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అవి వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఒక సినిమాలో ఐటెం సాంగ్‌ ను చేసిన పాయల్‌ రాజ్‌ పూత్‌ త్వరలోనే ఆ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్క తెలుగు, తమిళ్‌ అని కాకుండా అవకాశాలు ఎక్కడ నుంచి వస్తే అక్కడ సినిమాలు చేయడం ద్వారా పాయల్‌ రాజ్‌పూత్‌ ఎప్పుడూ బిజీగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాయల్‌ రాజ్‌పూత్‌ కి సోషల్‌ మీడియాలో నెగిటిల్‌ ట్రోలింగ్‌ కామన్‌, వాటికి ఎప్పటికప్పుడు ఇలా సమాధానం ఇవ్వడం ద్వారా పాయల్‌ కెరీర్‌లో ముందుకు సాగుతుంది.


Tags:    

Similar News