సుక్కు.. DSPని నిజంగానే పక్కన పెట్టేశారా?

సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. దేవిశ్రీ ప్రసాద్ పాటలంటే సుకుమార్ సినిమాలు గుర్తొస్తాయి.

Update: 2026-10-21 12:46 GMT

సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. దేవిశ్రీ ప్రసాద్ పాటలంటే సుకుమార్ సినిమాలు గుర్తొస్తాయి. ఆర్య నుంచి పుష్ప 2 వరకు వీరిద్దరి కాంబోలో ఎన్నో హిట్ పాటలు వచ్చాయి. అలాంటి కాంబినేషన్ రామ్ చరణ్‌ తో చేయబోతున్న కొత్త సినిమాకు కంటిన్యూ అవుతుందా లేదా అనే డిబేట్ కొంతకాలంగా జరుగుతోంది. ఆ సినిమా విషయంలో డీఎస్పీని పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతున్నా.. అసలు విషయం మాత్రం ఇంకా తేలలేదట.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ ముగ్గురి కలయికలో సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే, కొత్త సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బదులు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి.

దీంతో ఇన్నాళ్ల రిలేషన్ కు బ్రేక్ పడనుందా అనే డౌట్లు మొదలయ్యాయి. ఆ విషయంపై ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ కానీ, సుకుమార్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. ప్రాజెక్టులో క్రూ అండ్ క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో ఆ వార్తలు నిజమా కాదా అనేది క్లారిటీ లేదు. అదే సమయంలో నిర్మాత మైత్రి రవిశంకర్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఆ విషయంపై అందరి ఫోకస్ పడేలా చేశాయి.

దొంగ నా కొడుకు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడిన రవిశంకర్.. డీఎస్పీని తక్కువగా చూడలేమని స్పష్టం చేశారు. ఆయనలో ఎంతో టాలెంట్ ఉందని, తమ బ్యానర్ లో ఆయనతో ఏడు సినిమాలు చేశామని గుర్తుచేశారు. ఆ సినిమాలన్నింటికీ మంచి పాటలు వచ్చాయని, దేవిశ్రీ తమకు ఫ్యామిలీ మెంబర్ లాంటి వారని చెప్పారు. ఒక సినిమాలో ఆయన లేకపోయినంత మాత్రాన టాలెంట్ తగ్గిపోదని వివరించారు.

అయితే చరణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని రవిశంకర్ చెప్పడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయంలో దర్శకుడు సుకుమార్ నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ లండన్‌ లో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నిజానికి సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా కాలంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా పుష్ప పాటలు పాన్ ఇండియా రేంజ్ లో ఊపేశాయి. అందుకే ఆ కాంబోలో మరో సినిమా వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ ఒకే సంగీత దర్శకుడితో వరుసగా పనిచేయాలా, కొత్తగా ప్రయత్నించాలా అనేది దర్శకుడి క్రియేటివిటీ డెసిషన్. మరొకరితో పనిచేయాలనే ఆలోచన ఉన్నా, అది డీఎస్పీతో సంబంధాలు దెబ్బతిన్నాయని అర్థం కాదు. మైత్రీ రవి కామెంట్స్ బట్టి.. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని కూడా చెప్పలేం. అందుకే చరణ్ సినిమా నుంచి దేవిశ్రీని నిజంగానే పక్కన పెట్టారా అనే ప్రశ్నకు ఇంకా ఆన్సర్ లేదు. సుకుమార్ తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.



Tags:    

Similar News