ఇంకా 71 రోజులే.. హిట్ పర్సంటేజీ పెరిగే ఛాన్స్ ఉందా?

ఒక సినిమా హిట్ కావడం.. మరో మూవీ ఫ్లాప్ కావడం.. టాలీవుడ్‌ లో ఈ లెక్కలు ఎప్పుడూ ఉండేవే.

Update: 2026-10-21 11:30 GMT

ఒక సినిమా హిట్ కావడం.. మరో మూవీ ఫ్లాప్ కావడం.. టాలీవుడ్‌ లో ఈ లెక్కలు ఎప్పుడూ ఉండేవే. కానీ 2026లో మాత్రం విజయాల కంటే నిరాశపరిచిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే వందకు పైగా చిత్రాలు విడుదలైనా.. ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకున్న సినిమాలు కొన్నే ఉన్నాయి. దీంతో టాలీవుడ్ హిట్ పర్సంటేజీ తక్కువ స్థాయిలోనే ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే ఈ ఏడాదికి ఇంకా 71 రోజుల టైమ్ ఉంది. ఈలోపు వచ్చే సినిమాలు హిట్స్ కౌంట్ ను పెంచుతాయనే ఆశలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా విజయం సాధించిందా లేదా అన్నది దాని వసూళ్లను బట్టి మాత్రమే నిర్ణయించలేం. మూవీ కోసం పెట్టిన బడ్జెట్ ఎంత, థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, నిర్మాతలు, బయ్యర్లకు లాభాలు వచ్చాయా అన్నది కూడా చూడాలి.

అయితే కొన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధించినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతున్నాయి. మరికొన్ని చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కి మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. అందుకే ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నింటినీ పరిశీలిస్తే విజయాల శాతం సింగిల్ డిజిట్‌ లోనే ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇప్పుడే చెప్పలేం.

అక్టోబర్ చివరి వారం నుంచి డిసెంబర్ వరకు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 23న 418 విడుదలకు సిద్ధమవుతుండగా.. అక్టోబర్ 30న ఇట్లు అర్జున, కల్ట్ వంటి చిత్రాలు రానున్నాయి. అదే రోజున విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం కూడా విడుదల కానుంది. ఆ సినమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

నవంబర్‌ లోనూ వరుస విడుదలలు ఉన్నాయి. రామాయణ మొదటి భాగం, భోగి, ఈనగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, హైందవ వంటి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఒక్కో సినిమా ఒక్కో తరహా కథతో వస్తుండటంతో ప్రేక్షకుల ముందుకు విభిన్నమైన ప్రాజెక్టులు వస్తున్నట్లే. వీటిలో కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని, వసూళ్లు సాధిస్తే ఈ ఏడాది హైట్స్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది. ఇక డిసెంబర్‌ లో వృషకర్మ, కింగ్ 100, దాదా వంటి సినిమాలపై మంచి హైప్ ఉంది. ఏడాది చివర్లో విడుదలయ్యే సినిమాలకు సెలవులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మిగిలిన రోజుల్లో విడుదలయ్యే సినిమాల్లో కొన్ని క్లీన్ హిట్లుగా నిలిస్తే ఆ పర్సంటేజ్ కచ్చితంగా పెరగొచ్చు. అందుకే 2026 టాలీవుడ్‌ కు ఇంకా కాస్త టైమ్ మిగిలే ఉంది కాబట్టి ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ పక్కనపెట్టి, రాబోయే సినిమాల రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొచ్చు. మరి 2026లో లాస్ట్ రోజుల్లో విజయాలు పెరిగి టాలీవుడ్ హిట్ పర్సంటేజీ పెరుగుతుందో లేదో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News