భార్య కోరిక తీర్చలేక సతమతమవుతున్న హీరో!
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ అండ్ రాయల్ కపుల్ సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్‌ల మ్యాజికల్ బాండింగ్ గురించిన విశేషాలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి.
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ అండ్ రాయల్ కపుల్ సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్‌ల మ్యాజికల్ బాండింగ్ గురించిన విశేషాలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇటీవలే తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న జంట వ్యక్తిగత జీవితం ..ప్రేమ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుని అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే కరీనా కపూర్ ఖాన్ భర్త సైఫ్ అలీ ఖాన్‌కు ఇచ్చిన ఓ స్వీట్ అండ్ ఫన్నీ వార్నింగ్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో రోమాంటిక్ పోస్టులు, విష్‌లు పంచుకునే విషయమై సైఫ్ స్పందిస్తూ... తన భార్య కరీనా తరచుగా బాలీవుడ్ యంగ్ హంక్ విక్కీ కౌశల్‌ను చూసి నేర్చుకోమని తనను ఆటపట్టిస్తుంటుందని బయటపెట్టారు. `విక్కీ తన భార్య కత్రినా కైఫ్ కోసం సోషల్ మీడియాలో ఎంత అందమైన, సుదీర్ఘమైన కవితలు రాస్తున్నాడో చూడు అని కరీనా నన్ను నిలదీస్తుంటుంది. అతడు ఎంత ప్రేమగా పోస్టులు పెడతాడో చూసి నేర్చుకోవచ్చుగా అంటూ నన్ను తాంట్ చేస్తుంది` అని సైఫ్ సరదాగా వ్యాఖ్యానించారు.
సైఫ్ అలా చెప్పగానే వెంటనే స్పందించిన కరీనా కపూర్ `అవును మరి.. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే` అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి నవ్వులు పూయించారు. అలాగే భాగస్వామి పట్ల బహిరంగంగా ఇలా ప్రేమను వ్యక్తం చేయడం, రోమాంటిక్ లైన్లు రాయడం ఎంతో అందమైన విషయమని, ప్రతీ భార్య కూడా తన భర్త నుంచి అలాంటి రోమాంటిక్ పోస్టులను ఆశిస్తుందని కరీనా వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది.
కరీనా కామెంట్స్ పై స్పందించిన సైఫ్ `ఇప్పుడు నేను కూడా నీకోసం అలా సుదీర్ఘమైన కవితలు రాయాలా ఏంటి?" అని ప్రశ్నించడం.. దానికి కరీనా చిరునవ్వుతో అవునని సమాధానమివ్వడం ఈ జంట మధ్య ఉన్న సరదా కేమిస్ట్రీకి నిదర్శనంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని సైఫ్.. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి కరీనాతో ఉన్న ఫోటోలను పంచుకుని శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్‌ల జంట తమ అన్యోన్యతతో ఒకరిపై ఒకరు కురిపించే ప్రేమపూర్వక కవితలు, పోస్టులతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో భర్త సైఫ్ కూడా మరింత రోమాంటిక్‌గా మారి కవితలు రాయాలని కరీనా కోరుకోవడం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. బిటౌన్‌లో ఈ నలుగురి మధ్య ఉన్న స్నేహం.. ఒకరినొకరు ఆటపట్టించుకునే తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏళ్లు గడిచినా సైఫ్-కరీనాల మధ్య ఆత్మీయత.. ఒకరినొకరు టీజ్ చేసుకునే సరదా స్వభావం ఏమాత్రం తగ్గలేదని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. విక్కీ కవితలు చూసి నేర్చుకో అని కరీనా ఇచ్చిన క్యూట్ వార్నింగ్ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా.. రాబోయే రోజుల్లో సైఫ్ భార్య కోసం ఎలాంటి రోమాంటిక్ కవితలు రాస్తారో చూడాలనే ఆసక్తిని పెంచేస్తోంది.