స్టార్ హీరోయిన్లకు తమతో నటించే చిన్న ఆర్టిస్టులంటే అంత చులకన భావమా!
మీడియా ముందు కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు. కొంతమంది హీరోయిన్లు మీడియా ముందు చాలా బాగా మాట్లాడినా, తెరవెనుక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు.
మీడియా ముందు కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు. కొంతమంది హీరోయిన్లు మీడియా ముందు చాలా బాగా మాట్లాడినా, తెరవెనుక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. బయటకు కాస్త గంభీరంగా కనిపించే కొంతమంది వ్యక్తులు నిజ జీవితంలో మంచివారై ఉండవచ్చు. ఏదైనా సినిమాల్లో ఉన్న వాళ్లకే అలానే తోటి నటులకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమతో పాటు నటించే చిన్న ఆర్టిస్టులతో ఎలా ప్రవర్తిస్తారనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ క్రమంలో వైష్ణవి చైతన్య చెప్పిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అలా వైకుంఠపురములో వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన వైష్ణవి చైతన్య, ఆ తర్వాత బేబీ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. అయితే.. అంతకుముందు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల పక్కన చిన్న పాత్రల్లో కనిపించింది.
బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ఆనంద్ దేవరకొండతో కలిసి ఎపిక్ చిత్రంలోనూ హీరోయిన్గా కనిపించింది. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి.
కాగా.. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో తాను చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో ఎదురైన ఓ అనుభవాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
ఒకసారి షూటింగ్ సమయంలో తనకు అత్యవసరంగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చిందని వైష్ణవి తెలిపింది. చిన్న పాత్రలు చేసే ఆర్టిస్టులకు ప్రత్యేకంగా కారవాన్లు ఉండవని, అందువల్ల షూటింగ్ సమయంలో వాష్‌రూమ్ ఉపయోగించుకోవడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. సెట్స్‌లో ఉన్న వాష్‌రూమ్‌లు అందరూ ఉపయోగించేవి కావడంతో తనకు ఇబ్బంది ఎదురైందని చెప్పుకొచ్చింది.
దీంతో అక్కడే ఉన్న ఓ సీనియర్ నటిని కలిసి.. ఆమె కారవాన్‌ను ఉపయోగించుకోవచ్చా అని అడిగిందట. అందుకు ఆ నటి వెంటనే మొహం పైనే నో అని చెప్పి..నిరాకరించిందని వైష్ణవి చెప్పింది. తన కారవాన్‌ను మరొకరు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించడంతో పాటు, అవసరమైతే అసిస్టెంట్ డైరెక్టర్‌ను అడగాలని చెప్పిందని తెలిపింది.
ఆ సమయంలో ఆ మాటలు తనను బాధించాయని.. అయితే అప్పుడు తాను ఏమీ చేయలేకపోయానని.. కేవలం ఏర్పు వచ్చిందని.. వైష్ణవి గుర్తుచేసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా మారిన తర్వాత తనకు ప్రత్యేకంగా కారవాన్ ఉండటంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. జీవితంలో ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదని, ఎన్నో కష్టాలు పడిన తర్వాతే ఎదుగుదల ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.
ఈ ఇంటర్వ్యూ చూసిన పలువురు ప్రేక్షకులు, స్టార్ హీరోయిన్లు తమతో కలిసి నటించే చిన్న ఆర్టిస్టులతో ఇంతలా ప్రవర్తిస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైష్ణవితో ప్రవర్తించిన ఆ హీరోయిన్ ఎవరు అని కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు.t