బెల్లంకొండ మూవీ పోస్ట్ పోన్ మంచిదే..

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-09-02 06:33 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ పలు చిత్రాల ద్వారా మంచి హిట్స్ అందుకున్నారు. అదే సమయంలో ప్రభాస్ ఛత్రపతి మూవీ రీమేక్ తో బాలీవుడ్ కు వెళ్లి భంగపడ్డారు. కెరీర్ లో బ్యాడ్ స్టెప్ వేశారు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు.

రీసెంట్ గా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. సినిమాలో తన యాక్టింగ్ తో అలరించారు. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ కిష్కింధ పురిపైనే హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. ఆ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తాననే నమ్మకంతో ఉన్నారు.

డివైన్ ఎలిమెంట్స్‌ తో ఫాంటసీ హార్రర్ మూవీగా రూపొందుతున్న కిష్కింధ పురిని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఆ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన యాక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే వారిద్దరూ రాక్షసుడు మూవీకి జతకట్టారు. ఇప్పుడు మళ్ళీ కిష్కింధ పురిలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.

అదే రోజు మిరాయ్ మూవీ రిలీజ్ అవుతుండడంతో కిష్కింధ పురి పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. అనుకున్న అదే జరిగింది. ఒక్క రోజు మాత్రమే వాయిదా పడింది. సెప్టెంబర్ 13వ తేదీన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అదే సమయంలో 13వ తేదీ.. హారర్ మూవీకి సెంటిమెంట్ డేట్ గా అంతా పరిగణిస్తుంటారు.

హారర్ మూవీస్ టైటిల్స్ లో కూడా 13 నంబర్ ఇంక్లూడ్ చేస్తుంటారు మేకర్స్. అందుకే ఇప్పుడు ఆ డేట్ ను సెంటిమెంట్ గా కిష్కింధ పురి మేకర్స్ పరిగణనలోకి తీసుకున్నట్లు ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి కిష్కింధ పురి మూవీ ఒక్కరోజు వాయిదా పడినా.. అది మంచిదేనని నెటిజన్లు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే.. మంచి వసూళ్లు సాధించడం పక్కా అనే చెప్పాలి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News