86 మందికి డ్ర‌గ్స్ పాజిటివ్? హేమ కూడానా?

రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తాను హైద‌రాబాద్ లోని త‌న సొంత ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాన‌ని చెప్పిన వీడియో వైర‌ల్ అయింది.

Update: 2024-05-23 09:18 GMT

బెంగ‌ళూరు ఫామ్ హౌస్ రేవ్ పార్టీ వ్య‌వ‌హారం అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. ఈ కేసులో ప‌ట్టుబ‌డిన వారి శాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా ల్యాబ్ రిపోర్ట్ ప్ర‌కారం.. 86 మందికి డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చింద‌ని తాజాగా పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే పాజిటివ్ వ‌చ్చిన వారిలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి హేమ కూడా ఉన్నార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఈ కేసులో పాజిటివ్ వ‌చ్చిన వారంద‌రికీ పోలీసుల నుంచి నోటీసులు వెళ్ల‌నున్నాయ‌ని స‌మాచారం.

అయితే న‌టి హేమ తొలి నుంచి బెంగ‌ళూరు రేవ్ పార్టీకి వెళ్ల‌లేద‌ని త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తున్నారు. రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తాను హైద‌రాబాద్ లోని త‌న సొంత ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాన‌ని చెప్పిన వీడియో వైర‌ల్ అయింది. అయినా కానీ ఆ త‌ర్వాత పోలీసులు దానిని ఖండిస్తూ బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ‌ ఉన్నార‌ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలుగు మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. దానిని కూడా హేమ త‌న‌దైన శైలిలో ఖండించారు. చివ‌రికి ఈరోజు డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లో శ్యాంపిల్స్ పాజిటివ్ గా వ‌చ్చాయ‌ని మ‌ళ్లీ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ హేమ ఇప్ప‌టికీ దీనిని ఖండిస్తున్నారు.

Read more!

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దీనిపై మాట్లాడుతాన‌ని హేమ ఖండించిన‌ట్టు తెలుస్తుంది . ఇప్ప‌టివ‌ర‌కూ బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ అనే పేరు బ‌య‌ట‌ప‌డ‌లేదు. కృష్ణ వేణి అనే పేరును బెంగ‌ళూరు పోలీసులు చెబుతున్నారు కానీ, హేమ అనే పేరు చెప్పిన‌ట్టు ఎక్క‌డా ఆధారాలు లేవు . కృష్ణవేణి పేరు నే హేమ ఇచ్చారు అని అంటున్నారు.

Full View
Tags:    

Similar News