దేవరకొండ హీరో అవుతాడని బండ్ల అప్పుడే చెప్పారా?
అయితే విజయ్ హీరో అవుతాడని పుట్టిన వెంటనే బండ్ల గణేష్ చెప్పారట. రీసెంట్ గా ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు.;
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. తొలుత చిన్న పాత్రల్లో నటించిన విజయ్.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించిన విజయ్.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు.
ఆడియన్స్ కు మెచ్చే కథలు సెలెక్ట్ చేసుకుని సెన్సేషనల్ హీరోగా నిలిచారు. కానీ కొంత కాలంగా సరైన హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. వరుస సినిమాలు చేస్తున్నా.. అవి నిరాశ పరుస్తున్నాయి. అయితేనేం.. క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌసులతో వర్క్ చేస్తున్నారు. భారీ రేంజ్ చిత్రాల్లో దేవరకొండ నటిస్తున్నారు.
అయితే విజయ్ హీరో అవుతాడని పుట్టిన వెంటనే బండ్ల గణేష్ చెప్పారట. రీసెంట్ గా ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు. బ్లాక్ బస్టర్ హిట్ లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ లో పలు విషయాలు మాట్లాడిన బండ్ల గణేష్.. విజయ్ కోసం మాట్లాడారు. ఆయన తండ్రి, తాను ఒకే రూమ్ లో ఉండేవాళ్లమని చెప్పుకొచ్చారు.
"విజయ్ గురించి ఒక మాట చెప్పాలి.. వాళ్ళ ఫాదర్, నేను రూమ్ మేట్స్. ఓ మూడు రోజులు ఆయన కనబడలేదు. ఏమన్నా రాలేదు.. అని అడిగా.. నా కొడుకు పుట్టాడని చెప్పారు. ఓ హీరో పుట్టాడా అని అడిగా.. నా జీవితంలో ఏం అన్నా అవుద్ది.. ఏం చెప్పినా జరుగుద్ది.. నేను ఒక ఎమోషనల్ పర్సన్" అని బండ్ల గణేష్ తెలిపారు.
దీంతో బండ్ల గణేష్ అప్పుడు చెప్పినట్టు.. ఇప్పుడు విజయ్ మంచి హీరో అయ్యారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే విజయ్ తండ్రి గోవర్ధనరావు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక మునుపే ఆయన హైదరాబాద్ కు వచ్చారు.
సినిమాల్లో నటించాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ ఛానల్స్ లో ఆయన దర్శకత్వం వహించిన సీరియల్స్ అందరినీ అలరించాయి. అయితే తండ్రి అవ్వలేకపోయినా.. కొడుకులు విజయ్, ఆనంద్ మాత్రం హీరోలు అయ్యారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని సందడి చేస్తున్నారు.