బండ్లను ఇబ్బంది పెడుతున్న దెయ్యం?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గత కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి వేదికలపైకి వచ్చి అతడు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా మందికి కొత్త సందేహాలు మొదలయ్యాయి.;
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గత కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి వేదికలపైకి వచ్చి అతడు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా మందికి కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఆయన కొంపదీసి మళ్లీ నిర్మాత అవుతున్నాడా? అంటూ సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్ రన్ అవుతోంది. అతడు మెగాభిమాని కాబట్టి మళ్లీ పవన్ కల్యాణ్ లేదా చిరంజీవితో ఏదైనా సినిమాని ప్లాన్ చేసాడా? అంటూ ఒకటే చర్చ నడుస్తోంది.
చిరుకు భారతరత్న ఇవ్వాలని కోరిన అభిమానులలో బండ్ల ఒకడు. అందువల్ల చిరంజీవితోను సినిమాను నిర్మించాలనే కోరికతో ఉన్నాడని కూడా గుసగుస మొదలైంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలతో తనను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్ అని అభ్యర్థించాడు బండ్ల గణేష్. తాను ఎవరితోను సినిమాలు తీయడం లేదని తెలిపాడు. ఊహాగానాలు విడిచిపెట్టాలని అన్నాడు. అలాగే తనపై అభిమానం ప్రేమ ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకున్నాడు.
బండ్ల తిరిగి యాక్టివేట్ అయ్యాడు గనుక సినిమాల్లో నటిస్తాడా? అంటే అతడికి అభ్యంతరం లేదు. బండ్ల ప్రస్తుతం చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాడు. దర్శకనిర్మాతల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు. అందువల్ల నటించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్దగా వివాదాల జోలికి కూడా బండ్ల వెళ్లడం లేదు. జెంటిల్మన్ లా ఉన్నాడు గనుక నటుడిగా కెరీర్ ని తిరిగ తీర్చిదిద్దుకునేందుకు ఆస్కారం ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్, టెంపర్ లాంటి చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ సినిమాల నిర్మాణంపై ఎందుకనో విముఖతతో ఉన్నాడు. తాను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అన పిలిపించుకున్నా, సినిమాల నిర్మాణంపై ఎందుకనో వెగటుగా ఉన్నాడు..!!