రూ.1000 కోట్ల సినిమాలపై బండ్ల గణేష్ ఊహించని కౌంటర్

రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లిటిల్ హార్ట్స్ విజయోత్సవ వేడుకలకు హాజరైన ఆయన.. ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-09-19 07:58 GMT

టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కామెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లిటిల్ హార్ట్స్ విజయోత్సవ వేడుకలకు హాజరైన ఆయన.. ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీని ప్రశంసిస్తూనే.. చురకలు అంటించేలా కొన్ని కామెంట్స్ చేశారు.

తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాను అందించిన లిటిల్ హార్ట్స్ టీమ్ ను బండ్ల గణేష్ ప్రశంసించారు. ఏడెనిమిదేళ్ల తర్వాత తనకు కిక్‌ ఇచ్చిన సినిమా లిటిల్‌ హార్ట్స్‌ అని తెలిపారు. అంతకు ముందు మౌళి పోస్టర్‌ కూడా తానెప్పుడూ చూడలేదని తెలిపారు. మంచి కథతో సినిమా తీస్తే హిట్‌ అవుతుంది తప్ప, బడ్జెట్‌ తో లిటిల్ హార్ట్స్ మూవీ నిరూపించిందని చెప్పారు.

అయితే చిన్న సినిమా చూడరని అనుకునే ఈ రోజుల్లో యావత్‌ తెలుగు ప్రేక్షకులందరికీ థియేటర్‌ ను రప్పించిన చిత్రమని కొనియాడారు. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. మామూలు విషయం కాదని, అద్భుతమైన విజయంగా అభివర్ణించారు.

ప్రస్తుత రోజుల్లో పెద్ద సినిమాల నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన హైలైట్ చేశారు. కొన్ని పాన్ ఇండియా చిత్రాలకు, మూడు రోజుల షూటింగ్ రద్దు కారణంగా దాదాపు రూ.2.5 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అన్నారు. అదే డబ్బుల మొత్తంతో లిటిల్ హార్ట్స్ సినిమా రూపొంది.. రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అన్నారు.

అది తనతో సహా పెద్ద దర్శకులు, నిర్మాతలకు ఒక పాఠం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాకు రూ.500 కోట్లు లేదా రూ.1000 కోట్ల సినిమాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. బదులుగా కుటుంబాలను థియేటర్లకు తీసుకువచ్చే లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు పరిశ్రమకు అవసరమని ఆయన అన్నారు.

ప్రతి సంవత్సరం అలాంటి 12 సినిమాలు వస్తే తెలుగు సినీ పరిశ్రమ రాబోయే 100 సంవత్సరాల పాటు చల్లగా ఉంటుందని తెలిపారు. చిన్న సినిమా చచ్చిపోయింది.. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దామని అనుకుంటున్న రోజుల్లో లిటిల్ హార్ట్స్ మంచి కథతో తీస్తే సినిమా హిట్ అవుతుందని ప్రూవ్ చేసిందని తెలిపారు. కంటెంట్ ఆధారిత సినిమాలు నిజంగా ప్రజలను కనెక్ట్ చేస్తుందనే అభిప్రాయాన్ని మరోసారి బండ్ల గణేష్ వ్యక్తపరిచారు.

Tags:    

Similar News