న‌లుగురు సీనియ‌ర్లు అలా డివైడ్ అయ్యారా?

సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, నాగార్జున‌ సినిమాల ప‌రంగా స్టైల్ మార్చిన సంగ‌తి తెలిసిందే. స‌రికొత్త కాన్సెప్ట్ ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.;

Update: 2025-08-24 05:30 GMT

సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, నాగార్జున‌ సినిమాల ప‌రంగా స్టైల్ మార్చిన సంగ‌తి తెలిసిందే. స‌రికొత్త కాన్సెప్ట్ ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స్టోరీల ప‌రంగా పాత ఫార్మెట్ ని వ‌దిలేసి ట్రెండ్ ని ట్టుకుని సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. అలాగ‌ని పూర్తిగా వాటికి దూరం కాలేదు. వాటిని అప్పు డ‌ప్పుడు టచ్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభ‌ర తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదో సోషియా పాంట‌సీ థ్రిల్ల‌ర్. చిరంజీవికి ఇలాంటి కాన్సెప్ట్ లు కొత్తేం కాదు.

కొత్త‌గా స‌రికొత్త‌గా:

గ‌తంలో చేసిన అనుభ‌వం ఉంది. ఇప్పుడ‌దే క‌థ‌ని అడ్వాన్స్ డు టెక్నాల‌జీతో కొత్త‌గా చూపించబోతు న్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చెప్ప‌బోతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ గా మారింది. సీజీ, విజువ‌ల్ ఎఫెక్స్ట్ కు అధిక ప్రాధాన్య‌త ఉన్న సినిమా ఇది. రిలీజ్ ప‌రంగా ఆల‌స్యానికి కార‌ణం కూడా బెస్ట్ క్వాలిటీ ఇవ్వ‌డంలోనే జాప్యం జ‌రుగుతోంది. ఈ క‌థ కోసం చిరంజీవి లుక్ కూడా మార్చారు. అవ‌స‌ర‌మైన డైట్...వ‌ర్కౌట్లు చేసి లుక్ లో చాలా మార్పులు చేసారు. ఈ సినిమాతో పాటే అనీల్ రావిపూడితో 157వ చిత్రాన్ని ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాగానూ పూర్తి చేస్తున్నారు.

పాత్ర న‌చ్చితే గ్రీన్ సిగ్నెల్:

మ‌రో సీనియ‌ర్ నాగార్జున కూడా సినిమాలు చేసే విధానం మార్చారు. కుబేర‌, కూలీతో త‌న‌లో కొత్త యాంగిల్ ని త‌ట్టిలేపిన సంగ‌తి తెలిసిందే. తాను కేవ‌లం హీరో పాత్ర‌లు మాత్ర‌మే కాదు. స్టార్ హీరోల చిత్రాల్లో మ‌న‌సుకు న‌చ్చితే కీల‌క పాత్ర‌లు కూడా పోషిస్తాను? అని ఆ రెండు సినిమాల ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. న‌టుడిగా అన్ని ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించాల‌న్న‌ది నాగ్ ఆశ‌యంగా క‌నిపిస్తోంది. అలాగ‌ని హీరో పాత్ర‌ల‌కు దూరం కాలేదు. ఓవైపు కీల‌క పాత్ర‌ల‌తో పాటు, హీరోగానూ కొన‌సాగుతారు? అన్న‌ది నాగ్ లో ఛేంజ్ ని సూచిస్తుంది.

బాల‌య్య‌, వెంకీ మార్చాల్సిందే:

నాగ్, చిరు త‌ర‌హాలో ప్ర‌యోగాలు చేయాల్సిన సీనియ‌ర్లు మ‌రో ఇద్ద‌రున్నారు. వారే బాల‌య్య‌, వెంకటేష్ లు. స్టోరీల ప‌రంగా వీరిద్ద‌రు ఇంకా ఓల్డ్ ఫార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. కొత్త కాన్సెప్టుల్లో క‌నిపించ‌డంలో ఇద్ద‌రు వెనుక‌బ‌డే ఉన్నారు అనే వాద‌న నెట్టింట గ‌ట్టిగానే జ‌రుగుతోంది. కొత్త ప్ర‌యోగాల వైపు ఆస‌క్తి చూపించ‌డం లేదనే విమ‌ర్శ‌లొస్తున్నాయి. క‌లిసొచ్చిన క‌థ‌ల‌తో పాటు, వైవిథ్య‌మై క‌థ‌, పాత్ర‌ల వైపు అడుగులు వేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో చిరు, నాగ్ లు ఒక‌లా...బాల‌య్య‌, వెంకీ రూట్లు మ‌రోలా ఉన్నాయ‌నే చ‌ర్చ నెట్టింట మొద‌లైంది.

Tags:    

Similar News