• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డాకూ మహారాజ్' - గండ్ర...

'డాకూ మహారాజ్' - గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు

| నందమూరి బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-11-15 05:44 GMT

నందమూరి బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా ఆ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. పూర్ణిమ రోజు విడుదల చేసిన టైటిల్ టీజర్ ద్వారా ఈ చిత్రానికి ‘డాకూ మహారాజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌లో బాలయ్య స్టైలిష్, రగ్డ్, మాస్ అవతార్‌లో కనిపిస్తూ, అభిమానులకు విశేషంగా ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభవం అందించేందుకు మరింత బలంగా తీర్చిదిద్దుతున్నాడని అనిపిస్తోంది. బాలయ్య లుక్‌ను చూస్తే అభిమానులు థియేటర్లలో పండగ జరుపుకునే విధంగా ఉన్నట్లుగా కనబడుతోంది.

ఇక టీజర్ లో దర్శకుడు బాబీ వాయిస్ ఓవర్ పవర్ఫుల్ గా హైలెట్ అయ్యింది. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు. చీకటిలను శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్దం చేసిన ఓ రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది... అంటూ హీరో ఎలివేషన్స్ హైలెట్ చేశారు. మొత్తంగా టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు.

ఇక ఎడారి లాంటి భయంకర వాతావరణం, ముగ్గురు పవర్ఫుల్ విలన్స్.. ఇక బాలయ్య హిందీ డైలాగ్ వంటి అంశాలు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. సినిమాలో బారి కాన్వాస్ ఉన్న కథాంశం ఉండనున్నట్లు అర్ధమవుతుంది. సంక్రాంతికి జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారు. ఇక పొంగల్ బరిలో పక్కా డాకు మహరాజ్ ఇంపాక్ట్ చూపించేలా ఉన్నాడు అనిపిస్తోంది.

అసలే బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నారు. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. ఇక మరోవైపు దర్శకుడు బాబీ సైతం వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు. థమన్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇక కంటెంట్ ఏమాత్రం క్లిక్కయినా కూడా పండగ టైమ్ లో ఈ సినిమా డామినేట్ చేయడం గ్యారెంటీ అనిపిస్తోంది. బాలయ్యలుక్ ఎంతో ఫెరోషియస్ గా ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ మరియు నిరంజన్ దేవరమానే ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ ప్రొడక్షన్ లలో సంయుక్తంగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Full View
Tags:    
  • Daakumaharaajteaser 
  • Nandamuribalakrishna 
  • Bobbykolli 
  • Thaman 
  • Nagavamsi 
  • Daakumaharaaj 
  • Sitharaentertainments 

Similar News

ఏడాది గడిచినా తగ్గని దుఖం!

2026-11-24 12:48 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

విమ‌ర్శ‌ల వేళ త‌న‌యుడికి డాడ్ బూస్టింగ్!

2026-11-24 12:45 GMT

'ఆప‌రేష‌న్ సింధూర్' స‌మ‌యంలో భార‌త‌దేశానికి తెలియ‌ని భ‌యంక‌ర నిజం!

2026-11-24 12:40 GMT

అందం పుట్టుకతో వచ్చేదా? తయారు చేసుకునేదా?

2026-11-24 12:39 GMT

అలీతో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.. జుబేదా షాకింగ్ కామెంట్స్!

2026-11-24 12:36 GMT

నషా ముక్త్ భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి!

2026-11-24 10:23 GMT

రెండు కోట్ల హీరో..నేడు వందల కోట్లకు!

2026-11-24 09:54 GMT

జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి.. మీనాక్షి సమాధానం?

2026-11-24 09:52 GMT

నెపోలియన్..స్టాలిన్‌లకు సిక్స్ ప్యాక్ ఉందా?

2026-11-24 09:49 GMT

పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి.. మనసులో మాట చెప్పిన దివి!

2026-11-24 09:48 GMT

క్రమశిక్షణ..కఠిన డైట్‌తో యశ్ దృఢమైన దేహదారుఢ్యం!

2026-11-24 09:48 GMT

Copyright @2026

Powered by Blink CMS