ప్రభాస్ vs రానా: బాహుబలిని కట్టప్ప చంపకపోతే భళ్లా ఏం చేసేవాడు?

తెలుగు సినిమాకు గర్వకారణమైన చిత్రం ‘బాహుబలి’కి మరోసారి సోషల్ మీడియాలో మంచి హైప్ వచ్చింది.;

Update: 2025-07-17 13:02 GMT

తెలుగు సినిమాకు గర్వకారణమైన చిత్రం ‘బాహుబలి’కి మరోసారి సోషల్ మీడియాలో మంచి హైప్ వచ్చింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఈ రెండు భాగాల్ని కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే మూవీగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరోలు ప్రభాస్, రానాల మధ్య సోషల్ మీడియా చర్చ విశేషంగా వైరల్ అవుతోంది.

ఇప్పటికే ‘బాహుబలి: ది ఎపిక్’కి సంబంధించిన ఎడిటింగ్ పనులు మొదలయ్యాయి. కథను మళ్ళీ ఎడిట్ చేసి, రెండు సినిమాల నిడివిని కలిపి సుమారు మూడున్నర గంటల రన్‌టైమ్‌కి పరిమితం చేయాలని టీమ్ భావిస్తోంది. అభిమానులకు కొత్తగా అనిపించేలా కొన్ని సీన్లను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్’ థియేటర్లలో విడుదల కానుంది.

ఈ క్రమంలోనే బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో ఒక ఫన్నీ ప్రశ్నను అభిమానులకు సంచలనంగా వదిలింది. “ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేదో ఊహించండి?” అని పేర్కొన్నారు. దీనికి భళ్లాదేవ పాత్రలో నటించిన రానా స్పందిస్తూ “అదే జరిగితే, అతని బదులు నేనే చంపేశేవాడినిలే” అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే ప్రభాస్‌ నుంచి ఆసక్తికర స్పందన వచ్చింది. “1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘దీని కోసం నేనే చేయనిచ్చేవాడినిలే భళ్లా’ అని జబర్దస్త్ పంచ్ ఇచ్చాడు. వీరి ట్వీట్లు ఇప్పుడు నెటిజన్స్ మధ్య చక్కటి హాస్యం రేపుతున్నాయి.

ఈ చిన్న చర్చ అభిమానుల్లో మరోసారి ‘బాహుబలి’ మానియా మొదలుపెట్టింది. ప్రేక్షకులు మళ్లీ సినిమా థియేటర్లో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నిసార్లైనా చూసినా, వెండితెరపై ఒకే సినిమాగా, కొత్త ట్రీట్‌మెంట్‌తో చూడాలన్న అంచనాలు ఎక్కువయ్యాయి. పైగా ప్రభాస్, రానా మధ్య ఇలా సరదాగా చాట్ జరగడం అభిమానులను రీఫ్రెష్ చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్, యాక్షన్, విజువల్స్ అన్నీ మళ్లీ ప్రేక్షకుల మనసును కొల్లగొట్టేలా ఉన్నాయి.

బాహుబలి సినిమాల కలిపిన వెర్షన్‌పై ఇప్పుడు టాక్ మొదలైపోయింది. ఐపీఎల్ మ్యాచ్‌ సమయం నిడివి లెవల్లో ఉండేలా సినిమాను 3.5 గంటలపాటు కుదించబోతున్నారు. కథలో తేడా లేకుండా ప్రెజెంట్ చేయడం టీమ్ లక్ష్యం. ఈ వెర్షన్ కొత్తగా కనిపించేలా సౌండ్స్, విజువల్స్, టెక్నికల్ టచ్ అన్నింటిని మళ్లీ ఫ్రెష్‌గా డిజైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ తో బిజీగా ఉన్నా విషయం తెలిసిందే.

Tags:    

Similar News