అవును.. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ప్రత్యక్షమయ్యాడు. వారానికోసారి ప్రచురించే కవర్ పై ఈసారి సర్ ప్రైజ్ కనిపించింది. ప్రతిసారీ సూపర్ స్టార్ లపైనే దృష్టి పెట్టే సదరు మ్యాగజైన్ ఈసారి కేజీఎఫ్ స్టార్ యష్ పై దృష్టి పెట్టింది. అతడు ఒక సాధారణ డ్రైవర్ కుమారుడే అయినా గడిచిన కొంతకాలంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాడు. కేజీఎఫ్ రాఖీ భాయ్ గా భారీ ఫాలోయింగ్ ని సంపాదించాడు యష్. ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్ కవర్ పేజీనే అలంకరించిన ఘనుడయ్యాడు.
దక్షిణ భారతదేశంలోని నాలుగు పరిశ్రమలు - తెలుగు- తమిళం-మలయాళం- కన్నడ ఇండస్ట్రీలు ఉండగా.. కన్నడ ఇండస్ట్రీకి యష్ వల్ల అసాధారణ గుర్తింపు దక్కిందనే చెప్పాలి. రాజ్ కుమార్ లు ఏలే పరిశ్రమలో ఒక సాధారణ డ్రైవర్ కుమారుడు హీరోగా సత్తా చాటడం గొప్ప అనుకుంటే ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్ గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఒక రకంగా కన్నడ ఇండస్ట్రీని చిన్న చూపు చూసేవారికి అతడు ఒక ధీటైన జవాబుగా కనిపిస్తున్నాడు. కన్నడ ఇండస్ట్రీకే ముఖ చిత్రంగా.. బ్రాండ్ అంబాసిడర్ గా అతడిని భావించవచ్చు అనడానికి యష్ సాధిస్తున్న ఘనతను పరిశీలించాలి.
ఫోర్బ్స్ ఇండియా ఈసారి దక్షిణాదికి చెందిన ప్రముఖుల పై ఫోకస్ చేయగా.. తన ముఖచిత్రంలో ది రాకింగ్ స్టార్ యష్ ను ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై కనిపించిన మొదటి కన్నడ నటుడు యష్ కావడంతో కన్నడిగుల్లో గర్వం తొణికిస లాడుతోందనే చెప్పాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్పగా ఎదిగేందుకు మైసూరులోని తన విలేజ్ నుండి ఎలా పారిపోయి పరిశ్రమకు వచ్చాడో కవర్ కథనం వెలువరించడం ఆసక్తికరం. యష్ తదుపరి చిత్రం KGF: చాప్టర్ 2 మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపులరైంది. 2022లో రిలీజవుతున్న క్రేజీ మూవీగా రికార్డులకెక్కింది.
ఫోర్బ్స్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ఇన్ స్టాగ్రామ్ స్టార్ ల జాబితాలో 30 మందిని కూడా చేర్చింది. ఫోర్బ్స్ ముఖచిత్రంపై సౌత్ నటుల గురించి ప్రస్థావిస్తూ.. లేడీ సూపర్ స్టార్ నయనతార సహా మరో ముగ్గురు స్టార్ ల గురించి వెల్లడించింది. ఒక కథనంలో మహమ్మారి నుండి మలయాళ పరిశ్రమలోని ఇతర పెద్ద తారలతో పోలిస్తే దుల్కర్ సల్మాన్ తన తెలివైన OTT ఎంపికలతో దూసుకుపోయాడని వెల్లడించింది. మూడవ కవర్ పై చోటు దక్కించుకున్నది మొదటి కన్నడ నటుడు యష్ కావడం విశేషం.