చరణ్ ప్లానింగ్ వెనుక పెద్ద గేమే

ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెట్టారు. పెద్దిలో చరణ్‌ ను ఇప్పటివరకు చూడని లుక్, రోల్ లో చూపించే ప్రయత్నం చేశారు బుచ్చిబాబు.

Update: 2026-09-22 08:05 GMT

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చే ప్రతి సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇటీవల పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. ఆ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెట్టారు. పెద్దిలో చరణ్‌ ను ఇప్పటివరకు చూడని లుక్, రోల్ లో చూపించే ప్రయత్నం చేశారు బుచ్చిబాబు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమా ద్వారా ఆయన మరోసారి కొత్త తరహా పాత్రను ఎంచుకున్నారు. దీంతో చరణ్ స్టోరీల సెలక్షన్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఒక సినిమా తర్వాత మరో మూవీ పూర్తిగా భిన్నంగా ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. ఇక ప్రస్తుతం చరణ్.. దర్శకుడు సుకుమార్‌ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన ఆ కాంబినేషన్ మరోసారి కలవడంతో నార్మల్ గానే ఇంట్రెస్ట్ పెరిగింది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చరణ్ ఫోకస్ మొత్తం ఆ ప్రాజక్టుపైనే ఉంది. అయితే అసలు ఇంట్రెస్ట్ మాత్రం ఆ సినిమా తర్వాతే మొదలవుతోంది. సుకుమార్ మూవీ తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంపై ఇప్పటివరకు అఫీషియల్ క్లారిటీ లేదు.

కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా.. ఏ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇది చూస్తే చరణ్ లైనప్‌ లో ఎంప్టీ స్పేస్ ఉందని అనిపించొచ్చు. కానీ నిజానికి పరిస్థితి అలా ఉండకపోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న సుకుమార్ తో ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ఉండటంతో దానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. స్టోరీ, క్యాస్టింగ్, షూటింగ్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా సినిమా పూర్తయ్యే వరకు ఎక్కువ సమయం పడుతుంది.

అందుకే తర్వాతి సినిమాను వెంటనే ప్రకటించకపోవడం మామూలు విషయమే. అదే సమయంలో చరణ్ రేంజ్ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలను అబ్జర్వ్ చేస్తున్నారు. దీంతో తర్వాతి సినిమా విషయంలో స్టోరీ సెలక్షన్ ఇంపార్టెంగ్. కేవలం భారీ బడ్జెట్ లేదా మాస్ యాక్షన్ ఉంటే సరిపోదు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండాల్సిన అవసరం ఉంది.

అలా పెద్దితో స్పోర్ట్స్ జోనర్ ను టచ్ చేసిన చరణ్.. ఇప్పుడు సుకుమార్‌ తో మరో భిన్నమైన వరల్డ్ లోకి వెళ్లబోతున్నారు. ఇలాంటి సమయంలో వెంటనే మరో ప్రాజెక్టును అనౌన్స్ చేయకుండా కథ విషయంలో సమయం తీసుకుంటే అభిమానుల్లో అంచనాలు మరింత పెరగడం సహజం. ప్రస్తుతం చరణ్ లైనప్‌ చూస్తే ఎంప్టీ స్పేస్ కంటే ఒక ప్లాన్ ఉన్నట్లుగానే కనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఎవరెవరితో చరణ్ వర్క్ చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News