హీరో - డైరెక్టర్ లలో బెస్ట్ కాంబో ఎవరిది?
ఒక దర్శకుడు రాసుకున్న కథకి ఏ హీరో సెట్ అవుతాడో అతనితో సినిమాను చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు దర్శకులకు మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఒక దర్శకుడు రాసుకున్న కథకి ఏ హీరో సెట్ అవుతాడో అతనితో సినిమాను చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు. ఒకసారి హిట్ కాంబో వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో ఆ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటే చాలు ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం వాళ్ళ కాంబో తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి కొన్ని కాంబినేషన్స్ అయితే ఉన్నాయి.
ఎన్టీఆర్ - రాజమౌళి
వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు 4 సినిమాలు వచ్చాయి. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. దాంతో వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడటానికి అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...
ప్రభాస్ - రాజమౌళి
ప్రేక్షకుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. చత్రపతి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో వీళ్ళు పెను ప్రభంజనాలను క్రియేట్ చేశారు... మొదటి సారి పాన్ ఇండియాలో సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఘనత కూడా వీళ్ళకే దక్కింది...
మహేష్ బాబు - పూరి జగన్నాథ్
వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ఉండేది. వీళ్ళ కాంబోలో పోకిరి, బిజినెస్ మేన్ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు కూడా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మహేష్ బాబు లోని కొత్త నటుడిని బయటకు తీసిన సినిమాలు కూడా ఇవే కావడం విశేషం... మహేష్ బాబు డైలాగ్ డెలివరీలో పూరి పూర్తిస్థాయిలో మార్పులను తీసుకొచ్చాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు...
బాలయ్య - బోయపాటి శ్రీను
బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా చాలావరకు సక్సెస్ లను సాధించాయి. వీళ్ళ కాంబోలో నాలుగు సినిమాలు వస్తే అఖండ 2 సినిమాను మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలతో బాలయ్య బాబు ఇమేజ్ పెరగడమే కాకుండా బోయపాటి శ్రీను కూడా తన మార్కెట్ ను పెంచుకున్నాడు...
నాని - శ్రీకాంత్ ఓదెల
ప్రస్తుతం నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన 'దసర' సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరో రెండు రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఈ సినిమా మీద కూడా పాజిటివ్ వైబ్ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ప్యారడైజ్ సినిమా సూపర్ సక్సెస్ అయితే వీళ్ళ కాంబినేషన్ కూడా సక్సెస్ ఫుల్ కాంబో గా నిలుస్తుంది. ఇక వీళ్ళిద్దరి కలిసి మరో సినిమాలో చేస్తే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతాయనే పేరును కూడా తెచ్చుకునే అవకాశాలైతే ఉన్నాయి...