సింపుల్ స్మైల్ తో రేణూ దేశాయ్ సరికొత్త లుక్!

రేణూ దేశాయ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా, నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Update: 2026-09-22 08:03 GMT

రేణూ దేశాయ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా, నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తొలిసారి 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసింది. అదే ఏడాది ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం.. ప్రేమ, పెళ్లికి ముందే అకీరాకు జన్మనివ్వడం, ఆ తర్వాత పెళ్లి , ఆధ్యా జన్మించడం, విడాకులు అన్నీ జరిగిపోయాయి.




 


క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రేణూ దేశాయ్..

పిల్లలతో కలిసి ముంబైలోనే ఉంటూ అటు అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు తనదైన శైలిలో స్పందిస్తూ వార్తలలో నిలుస్తున్న రేణూ దేశాయ్ ఈ మధ్యకాలంలో తనకంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక స్పేస్ నిర్మించుకుంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఇదిలా ఉండగా తాజాగా అందంగా సింపుల్గా మళ్లీ నాటి రోజులను గుర్తుచేసేలా రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటోలు అలాగే వయసు అయిపోతోంది అంటూ పంచుకున్న క్యాప్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




 


వయసు అయిపోతోంది..

బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె ఇందులో జుట్టును విరబోసుకొని సింపుల్ మేకప్ లో చాలా అందంగా నవ్వుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటి రేణు దేశాయ్ గుర్తుకొస్తుంది అంటూ అభిమానులు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె పంచుకున్న క్రేజీ క్యాప్షన్ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన జుట్టు మారిన రంగు గురించి మాట్లాడుతూ.. "నెమ్మదిగా కాలం సాగుతోంది.. వయసు అయిపోతుంది.. చిన్న చిన్నగా తెల్ల జుట్టు వస్తోంది. అప్పుడే ముడతలు కనిపించడం మొదలయ్యాయి. గడిచిపోయిన ఒక యుగానికి నిదర్శనం ఇది. కొన్ని నెలల్లో నాకు 46 ఏళ్ళు వస్తాయి. 50 ఏళ్లకు నేను దగ్గరవుతున్నాను" అంటూ రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




 


రేణూ దేశాయ్ నిజాయితీకి నెటిజన్స్ ఫిదా..

ఇకపోతే రేణూ దేశాయ్ వయసు అయిపోతోంది.. తెల్ల జుట్టు వస్తోంది అంటూ చేసిన కామెంట్లకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నిజానికి రేణూ దేశాయ్ నిజాయితీని ఒప్పుకొని తీరాల్సిందే. సాధారణంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తమ ఏజ్ చెప్పుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. పైగా కొంతమంది ధైర్యం కూడా చేయరు. అలాంటిది నిస్సందేహంగా నిజాయితీగా రేణు దేశాయ్ తనకు వయసు అయిపోతోందని, తెల్ల జుట్టు కూడా వస్తోందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికైతే రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Tags:    

Similar News