• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు ఆడియన్స్ పల్స్...

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

| మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. విభిన్న కథలు, పాత్రల ఎంపికతో పాటు తెలుగులో మాట్లాడటం, ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం ఆయనకు కలిసొస్తున్నాయి. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’తో ఆకట్టుకున్న దుల్కర్.. నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇతర భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకోవాలంటే దుల్కర్‌ను చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాల్సిన అంశాలున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-13 07:08 GMT

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు.. ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. కొంతమంది తెలుగు హీరోల కన్నా కూడా ఈయనకి అభిమానులు ఎక్కువగా ఉండటం విశేషం. అయితే దీనికి కారణం కేవలం సినిమాలు మాత్రమే కాదు. ఆయన ఎంచుకునే కథలు, పాత్రలు, అభిమానులతో మెలిగే విధానం కూడా అయింది తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ దగ్గర చేస్తున్నాయి.

సాధారణంగా ఒక భాషకు చెందిన హీరో మరో భాషలో గుర్తింపు తెచ్చుకోవాలంటే అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గర అవ్వాలి. వారి అభిరుచులకు తగ్గ సినిమాలు చేయడంతో పాటు, సినిమా ప్రమోషన్లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయం దుల్కర్ సల్మాన్ బాగా అర్థం చేసుకున్నారు. తెలుగు సినిమాలు చేస్తున్నప్పటి నుంచే ఇక్కడి ప్రేక్షకులతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇంటర్వ్యూలలో తెలుగులో మాట్లాడుతూ ఉండడం.. సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం ఆయనకు మరింత ప్లస్ అవుతోంది.

మరోవైపు దుల్కర్ సల్మాన్ తీసే సినిమాలు కూడా.. ఆయనకు పాపులారిటీ పెంచుతూనే వస్తున్నాయి ‌. హీరో అంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్లు ఉండాలనే లెక్కలకు దుల్కర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది, ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ఎంతకాలం నిలిచిపోతుంది అనే విషయాలపై దృష్టి పెడతారు. అందుకే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు ఆకాశంలో ఒక తార సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కూడా చాలావరకు.. దుల్కర్ సల్మాన్ గత తెలుగు సినిమాల లాగానే.. కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేలా కనిపిస్తోంది.

నిజానికి మరో భాషలో స్టార్‌డమ్ సంపాదించడం అంత సులభం కాదు. కానీ దుల్కర్ తన సినిమా సెలక్షన్, తన ప్రమోషన్ స్ట్రాటజీ ద్వారా.. ఈ విషయాన్ని తేలిక గానే చేసేసారు. ఇక ఇదే విషయం మన తెలుగు హీరోలు కూడా దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా అవసరం.

Tags:    
  • dulquersalmaan 
  • aakasamlookatara 
  • sitaramam 

Similar News

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS