• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

| మౌళి హీరోగా నటించిన ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) క్రైమ్ కామెడీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, గందరగోళమైన కథనం, సిల్లీ ట్విస్టులు, సాగతీత సన్నివేశాలు విసిగిస్తాయి. మౌళి కామెడీ టైమింగ్, అలీ, బబ్లూ నటన కొంతవరకు ఆకట్టుకున్నా.. కామెడీ, థ్రిల్ రెండూ పండలేదు.

By - Tupaki Desk
Update: 2026-11-13 06:35 GMT

‘డి.ఎన్.కె.’ మూవీ రివ్యూ

నటీనటులు: మౌళి- సుష్మిత శెట్టి-ఆలీ-రజిత- బబ్లూ- రఘుబాబు- గుండు సుదర్శన్- నందగోపాల్- భద్రం- రమణ భార్గవ తదితరులు

సంగీతం: శింజిత్ ఎర్రమిల్లి

ఛాయాగ్రహణం: సూర్య బాలాజి

నిర్మాతలు: నవీన్ యెర్నేని- రవిశంకర్ యలమంచిలి

రచన-దర్శకత్వం: శ్రీను కంభాల

గత ఏడాది ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ నటుడు మౌళి. దాని తర్వాత అతను హీరోగా నటించిన చిత్రం.. దొంగ నా కొడుకు అలియాస్ డి.ఎన్.కె. క్రేజీ ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మౌళి మళ్లీ కొట్టాడా హిట్టు? తెలుసుకుందాం పదండి.

కథ: ఈశ్వర్ (మౌళి) ఒక ఆవారా కుర్రాడు. క్రికెట్ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని.. తల్లిదండ్రులకు భారంగా మారిన అతను.. ఒకమ్మాయితో ప్రేమలో పడి.. తన అవసరాల కోసం ఆ అమ్మాయి ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి చిక్కుల్లో పడతాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలిసి ఒక గడువు లోపు పది లక్షలు కట్టమని కండిషన్ పెడతాడు. దీంతో మరో మార్గం లేక తన ఫ్రెండుతో గోల్డ్ షాప్ దొంగతనానికి రెడీ అవుతాడు ఈశ్వర్. కానీ అతను దొంగతనానికి వెళ్లేలోపే అక్కడ దోపిడీ జరిగిపోయి ఉంటుంది. ఈశ్వర్ తన ఫ్రెండుతో కలిసి పోలీసులకు దొరికిపోతాడు. మరి ఈ సమస్య నుంచి అతను ఎలా బయటపడ్డాడు.. నిజంగా దోపిడీ చేసింది ఎవరు.. ఈ మిస్టరీని ఈశ్వర్ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒక పెద్ద దొంగతనం చుట్టూ నడిచే క్రైమ్ కామెడీ జానర్ కథల నుంచి ప్రేక్షకులు మరీ విశేషమైన.. కొత్త తరహా కథ ఏమీ ఆశించరు. రొటీన్ కథకే కొన్ని ట్విస్టులు జోడించి.. దాని చుట్టూ రేసీ స్క్రీన్ ప్లేతో.. కామెడీ ప్రధానంగా సినిమాను నడిపిస్తే చాలు.. టైంపాస్ చేయించేయొచ్చు. ‘దొంగ నా కొడుకు’ టీం ఎంచుకున్న కథలో అలా పాసైపోయే ట్విస్టులు ఉన్నాయి. కానీ ఆ ట్విస్టులను తెలివిగా ప్లేస్ చేసి ఉంటే.. కొంచెం లాజికల్ గా కథను నడిపించి ఉంటే ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగేది. కానీ ప్రేక్షకులకు అసలు బుర్రే ఉండదన్నట్లుగా మరీ సిల్లీగా ట్విస్టులను ప్రెజెంట్ చేసి.. మినిమం సెన్స్ లేకుండా చాలా గందరగోళంగా కథనాన్ని నడిపించి.. నాన్ స్టాప్ గా ఇరిటేషన్ తెప్పించింది చిత్ర బృందం. లేదంటే.. ఒక ట్రావెల్ బ్యాగులో బంగారం మధ్య ఒక మనిషి తల పెడితే.. రోజుల తరబడి ఇంట్లో పెట్టుకున్నా.. ఎంతమంది చేతులు మారినా.. ఎవ్వరికీ రవ్వంత కూడా డౌట్ రాన్నట్లు.. ఎవ్వరూ గుర్తు పట్టరన్నట్లు చూపించడమేంటి? అదే చిత్రమంటే.. ఆ బ్యాగు గుట్టు ఏంటో తెలిసిపోయాక దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట వదిలిపెడదాం అని చేసే ప్రయత్నాలమీద పావు గంట పాటు సిల్లీగా సన్నివేశాలను నడిపించమేంటి? ప్రేక్షకులను మరీ గ్రాంటెడ్ తీసుకుని.. ఏం రాసినా ఏం తీసినా చూస్తారులే అనుకుంటే తప్ప ఇలాంటి సీన్లు ఫైనల్ కట్ లోకి రావు.

‘లిటిల్ హార్ట్స్’లో సింపుల్ స్టోరీ.. సింపుల్ సీన్లతోనే ఎంతో హాయిగా నవ్వించాడు మౌళి. కానీ ఈసారి మాత్రం ఒక కథను ఎంతగా కాంప్లికేట్ చేయొచ్చో.. ఎంత సిల్లీగా సన్నివేశాలను ప్రెజెంట్ చేయవచ్చో చూపించాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలైపోయి తన చుట్టూ ఉన్న వాళ్లందరినీ సాంతం నాకేసే పాత్ర చేశాడు మౌళి ఇందులో. చాలామంది రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. కుటుంబాలను విషాదంలోకి నెడుతున్న కుర్రాళ్లకు ప్రతినిధి లాంటి పాత్రను సెటైరికల్ గా డీల్ చేసి.. చివరికి ఒక మంచి మెసేజ్ ఇస్తారనుకుంటాం మొదట్లో ఈ పాత్రను చూసి. కానీ ఆరంభం బాగున్నప్పటికీ.. తర్వాత ఈ పాత్రను కంగాళీగా తయారు చేసి.. బంగారం దొంగతనం చుట్టూ తలా తోకా లేకుండా కథనాన్ని నడిపించి ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది టీం. బంగారం దొరికాక దాన్ని సేల్ చేయడానికి హీరో తన ఫ్రెండు చేసే ప్రయత్నాలు కానీ.. అది అసలు బంగారం కాదని తేలిపోయాక గోల్డులో పాటు ఉన్న తలను వదిలించుకోవడానికి పడే పాట్లు కానీ.. కనీసం నవ్వు తెప్పించవు. చూపించిన సీన్లనే మళ్లీ మళ్లీ చూపిస్తూ.. విపరీతమైన సాగతీతతో అంతకంతకూ అసహనం పెంచడమే తప్ప.. ఎక్కడా నవ్వులకు అవకాశమే లేకపోయింది.

క్రైమ్ కామెడీల్లో కథను ఒకలా నడిపించి.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఇప్పటిదాకా మీరు అనుకున్నదంతా భ్రమ.. అసలు విషయం ఇది అని పెద్ద ట్విస్ట్ ఇవ్వడం మామూలే. ఐతే ఆ ట్విస్టులు చూసి థ్రిల్ అవ్వాలి కానీ.. ప్రేక్షకులు ఫూల్స్ అయ్యాం అనుకోకూడదు. ‘డీఎన్కే’ రెండో రకం ఫీలింగే ఇస్తుంది. ట్విస్టులను సరిగ్గా ప్లేస్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. నిజానికి ఈ పాయింటునే కొంచెం తెలివిగా డీల్ చేసి ఉంటే.. సన్నివేశాలను మరీ ఇంత నాన్ సీరియస్ గా కాకుండా కొంచెం బిగితో నడిపించి ఉంటే.. ‘డీఎన్కే’ కొంచెం క్రేజీ రైడ్ గా మారేది. కానీ కామెడీ పేరుతో మరీ సిల్లీగా సన్నివేశాలను నడిపించడంతో ‘డీఎన్కే’ కథను ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేం. ఇటు కామెడీ పండక.. అటు కథలోని ట్విస్టులు థ్రిల్ చేయక రెంటికీ చెడ్డట్లు తయారైందీ సినిమా. కుర్రాళ్లు ఎంజాయ్ చేసే కొన్ని అడల్ట్ జోకులు.. మౌళి తన వరకు పంచిన కాస్త వినోదం తప్పిస్తే ‘డీఎన్కే’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

నటీనటులు: మౌళిలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. దాన్ని కొన్ని చోట్ల బాగానే చూపించాడు.. నవ్వించాడు. స్టార్ అయిపోయాను అనుకోకుడా.. ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా సింపుల్ క్యారెక్టరే చేయడం.. తన మీద పంచులు వేయించుకోవడం బాగుంది. కానీ వీక్ స్క్రిప్టుతో తెరకెక్కిన సినిమాను తన భుజాల మీద మోసేంత కెపాసిటీ తనకు లేకపోయింది. తనకున్న పరిమితుల దృష్ట్యా కొన్ని చోట్ల ఏమీ చేయలేక సైలెంటుగా ఉండిపోయాడు. హీరోయిన్ సుష్మిత శెట్టి పర్వాలేదు. మౌళి పక్కన సెట్ అయింది. మొదట్లో తన పాత్రను కొంచెం హైలైట్ చేసి.. తర్వాత పక్కన పడేశారు. హీరో పక్కనే ఉండే ఫ్రెండు పాత్రలో బబ్లూ బాగా చేశాడు. నవ్వించాడు. హీరో తండ్రి పాత్రలో ఆలీ నవ్వించాడు. రజిత కూడా ఓకే. గుండు సుదర్శన్ ను సరిగా ఉపయోగించుకోలేదు. పుల్లయ్య పాత్రలో రఘుబాబు బాగా చేశాడు. జై కృష్ణ చేసిన టిపికల్ క్యారెక్టర్ తో కామెడీ పెద్దగా పండలేదు. భద్రం పాత్రకు చివర్లో ట్విస్ట్ ఇచ్చారు కానీ.. అది క్లిక్ కాలేదు. పోలీస్ పాత్ర చేసిన నటుడు.. మిగతా ఆర్టిస్టులు మామూలే.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘దొంగ నా కొడుకు’ ఒక మోస్తరుగా అనిపిస్తుంది. శింజిత్ ఎర్రమిల్లి సినిమా శైలికి తగ్గట్లు సరదా పాటలు ఇచ్చాడు. సాంగ్స్ మళ్లీ వినాలనిపించేలా లేకపోయినా.. సినిమాలో బాగానే సెట్టయ్యాయి. తన బీజీఎం కూడా కొంచెం హుషారు తెప్పించేలా సాగింది. సూర్య బాలాజీ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీను కంభాల రాసుకున్న మూల కథలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ కథను చెప్పిన పద్ధతి మాత్రం బాగా లేదు. కొంచెం కూడా బిగి లేని.. లేజీ నరేషన్ తో సినిమాను చాలా గందరగోళంగా మార్చేశాడు. కొన్ని కామెడీ సీన్ల వరకు నవ్వించినా.. చాలా వరకు విసిగించాడు దర్శకుడు.

చివరగా: దొంగ నా కొడుకు.. ట్రాక్ తప్పాడు

రేటింగ్- 2/5

Tags:    
  • dnkmovie 
  • donganakoduku 
  • dnkmoviereview 
  • dnkmovierating 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

Copyright @2026

Powered by Blink CMS