ప్యారడైజ్ 'బాస్'.. ఈసారీ వర్కౌట్ అయితే..
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు సినిమా రిలీజ్ కు ముందే ఆసక్తి పెంచుతాయి. మరికొన్ని కాంబినేషన్లు మాత్రం సినిమా రిజల్ట్ తో తమ వాల్యూ పెంచుకుంటాయి.
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు సినిమా రిలీజ్ కు ముందే ఆసక్తి పెంచుతాయి. మరికొన్ని కాంబినేషన్లు మాత్రం సినిమా రిజల్ట్ తో తమ వాల్యూ పెంచుకుంటాయి. నేచురల్ స్టార్ నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్ ఇప్పుడు రెండో కోవలో కనిపిస్తోంది. దసరా మూవీతో మొదలైన ఆ జోడీ ఇప్పుడు ది ప్యారడైజ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
దసరా సక్సెస్ తో సుధాకర్ చెరుకూరి బ్యానర్ కు వచ్చిన గుర్తింపు ఒక విషయం. ఆ తర్వాత అదే హీరో, అదే దర్శకుడితో మరో భారీ మూవీ చేయడం మరో విషయం. సాధారణంగా ఒక హిట్ తర్వాత నిర్మాతలు కొత్త కాంబినేషన్ల వైపు వెళ్లడం కామన్. కానీ ఇక్కడ సుధాకర్ చెరుకూరి రిస్క్ ను కంటిన్యూ చేశారు. దసరా ఇచ్చిన రిజల్ట్ ను నమ్మి ది ప్యారడైజ్ కోసం మరింత బిగ్ రేంజ్ లో ఇన్వెస్ట్ చేశారు.
అందుకే ఆ సినిమా రిలీజ్ కు ముందు కనిపిస్తున్న అసలు ఇంట్రెస్ట్ నాని రోల్ లేదా భారీ మేకింగ్ చుట్టూ మాత్రమే కాదు. ఒక నిర్మాత తనకు కలిసొచ్చిన కాంబినేషన్ ను ఎంత దూరం తీసుకెళ్లగలడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దసరాతో నాని, శ్రీకాంత్ ఓదెల జోడీకి స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ది ప్యారడైజ్ లో ఆ అంచనాలను మళ్లీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.
స్టోరీ పూర్తిగా కొత్తది. బ్యాక్ డ్రాప్ కొత్తది. నాని పాత్ర కూడా గత సినిమాతో పోల్చలేని విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంటే తొలి సినిమా విజయాన్ని కాపీ చేయకుండా అదే కాంబో నుంచి మరో కొత్త వరల్డ్ చూపించే ప్రయత్నం జరుగుతోంది. అయితే సుధాకర్ చెరుకూరి విషయంలో మరో లెక్క ఉంది. దసరా ఆయన బ్యానర్ కు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది.
ప్యారడైజ్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తే.. నానితో ఆయన కాంబినేషన్ నార్మల్ హిట్ జోడీ నుంచి ఒక నమ్మకమైన కాంబోగా మారుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారా అనే డిబేట్ కు స్త్రెంత్ వస్తుంది. ఇక్కడే హ్యాట్రిక్ అనే మాట ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇప్పటివరకు అఫీషియల్ గా మూడో సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదు. కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఫిక్స్ అయిన విషయం కాదు. కానీ ప్యారడైజ్ భారీ విజయం సాధిస్తే.. నాని, సుధాకర్ చెరుకూరి కాంబోలో మరో ప్రాజెక్టుపై అంచనాలు క్రియేట్ అవుతాయి.
ముఖ్యంగా నాని ప్రస్తుతం విభిన్న కథలను ఎంచుకుంటున్న సమయంలో.. సుధాకర్ చెరుకూరి కూడా తన బ్యానర్ లో కేవలం స్టార్ కాంబినేషన్లకే కాకుండా భారీ కాన్సెప్ట్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ రెండు ఆలోచనలు కలిస్తే మూడో సినిమా కోసం మరో కొత్త దర్శకుడు లేదా మరో కొత్త స్టోరీ కూడా రావచ్చు. మరి ప్యారడైజ్ వర్కౌట్ అయితే మాత్రం.. నాని, సుధాకర్ కాంబోలో హ్యాట్రిక్ కోసం చర్చలు ఓ రేంజ్ లో జరగడం ఖాయం.