రాఖీ భాయ్ ఎప్పుడొస్తాడు? KGF 3 ఉత్కంఠకు తెర దించాడు!
కేజీఎఫ్- కేజీఎఫ్ 2 సంచలన విజయాలు సాధించిన తర్వాత ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడో భాగం ఎప్పుడొస్తుందా? అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాకింగ్ స్టార్ యష్ అభిమానులు పార్ట్ 3 త్వరగా రావాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే కేజీఎఫ్ 3 ఉంటుందా ఉండదా? అన్నదానిపై ఇప్పటివరకూ సరైన స్పష్ఠత లేదు. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ తో యష్ మూడో భాగం కథపై చర్చిస్తున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ దేనికీ క్లియర్ పిక్చర్ ఏమిటన్నది ఇప్పటివరకూ తేలలేదు.
తాజాగా ఇండియా టుడే కాన్ క్లేవ్ (ముంబై) 2022 లో 2వ రోజు యష్ స్వయంగా KGF 3 ఉంటుందా లేదా? అన్నదానిపై మాట్లాడారు. 2022 ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద KGF 2 అద్భుతాలు సృష్టించిన తర్వాత యష్ క్రేజ్ స్కైని తాకింది. అప్పటి నుండి అతని అభిమానులు KGF 3 ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో తాజాగా గోల్డ్ స్టాండర్డ్ సెగ్మెంట్ విభాగంలో రాకింగ్ స్టార్ మాటలు ఫ్యాన్స్ కి నిజంగానే షాక్ నిచ్చాయి. ``ది రాక్-కింగ్ స్టార్`` అనే టైటిల్ తో హృదయాలను గెలుచుకుని రికార్డులను బద్దలు కొట్టడం అంటే ఏంటో చూపించిన యష్ చివరకు KGF 3 గురించి మాట్లాడుతూ అందరినీ నిరాశ పరిచాడు.
కాన్ క్లేవ్ లో ఓ జర్నలిస్ట్ యష్ ని KGF 3 ప్రకటన ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. దానికి యష్ మాట్లాడుతూ-```మేం మీ నుండి మంచి వార్తలను ఆశిస్తున్నాం కాబట్టి.. నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని నేను చెప్పాను (నవ్వుతూ..చాలా కాల్షీట్లు ఇవ్వాలి కదా అందుకని). మూడో భాగంపై చాలా వార్తలు హల్ చల్ చేస్తున్నాయని నాకు తెలుసు. అయితే ఒకవేళ పార్ట్ 3 ఉంటే నేనే అధికారికంగా ప్రకటిస్తాను. అప్పుడే నిర్మాతలు ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తారు. మిగతా ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి. నిజం ఏమిటో అది బయటకు వచ్చినప్పుడు నేనే వచ్చి మీ అందరికీ చెబుతాను`` అని వ్యాఖ్యానించారు.
యష్ KGF ఫ్రాంచైజీ భారీ విజయం గురించి కూడా ముచ్చటించాడు. ``ఇది అహంకారం అనిపించకపోతే.. నేను అద్భుత విజువల్ ఫీస్ట్ మూవీలో నటించాను. దీనికోసం నేను ఎంతో వేచి చూసాను. ఈ విజయం 5-6 సంవత్సరాల క్రితం రావాలనుకున్నాను. కానీ రాలేదు. కానీ నన్ను ప్రతిదీ ప్రభావితం చేస్తుంది. నేను ఇప్పుడు ఒక రకంగా ముందుచూపుతో ఆలోచిస్తున్నాను`` అని అన్నాడు.
కేజీఎఫ్ విజయం.. బాక్సాఫీస్ స్థాయి చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారతదేశం చాలా సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశం. మనం చేయగలిగినది కొంతే. మనమంతా కలిసికట్టుగా ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్లగలం. ఏదైనా పెద్దగా అందించేందుకు ఆలోచించడంలో మాకు సహాయపడండి. ఇప్పటివరకూ మనం వినియోగించుకున్న సామర్థ్యం 5-10 శాతం మాత్రమే. తర్వాతి తరం నుండి మనం చాలా ఎక్కువ ఆశించవచ్చు`` అని కూడా స్ఫూర్తివంతంగా యష్ మాట్లాడారు.
ప్రశాంత్ నీల్ తో KGF చాప్టర్ 1 .. KGF: చాప్టర్ 2తో యష్ కీర్తిప్రతిష్ఠలు పతాకస్థాయికి చేరుకున్నాయి. కన్నడ రంగంలోనే కాస్ట్ లీ హీరోగా మారాడు. గ్లామర్ వరల్డ్ అనే చదరంగంలో పాములను తొక్కుకుంటూ నిచ్చెనలను అధిరోహించాడు. ఇప్పుడు దేశంలోనే స్టారాధి స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తన అభిమానులు తదుపరి పాన్ ఇండియన్ చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు.