వ‌దిన‌మ్మ ఎంట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహ‌మా?

ఈ క్రమంలోనే సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ ను మరింత యాక్టివేట్ చేయాలని పవన్ భావిస్తున్నారు.;

Update: 2026-03-26 03:30 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సతీమ‌ణి అన్నా లెజ్నేవా సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కాలం సైలెంట్ గా ఉన్న అన్నా లేజ్నేవా ఒక్క‌సారిగా ప‌బ్లిక్ ప్లాట్ ఫాం మీద‌కు రావ‌డంతో ఆస‌క్తి సం త‌రించుకుంది. హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించడం, పవన్ కళ్యాణ్ తన భార్యకు సాదర స్వాగతం పలకడం చూస్తుంటే? దీని వెనుక కేవలం సోషల్ మీడియా సందడి మాత్రమే కాక‌ బలమైన వ్యాపార వ్యూహం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను వదిలి పెట్టే ఉద్దేశం లేదని తాజా చిత్రాల వేగం చూస్తుంటే అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ ను మరింత యాక్టివేట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని నిర్మాణ సంస్థ‌ల భాగ‌స్వామ్యంలో ప‌ని చేస్తున్నా? పూర్తి స్థాయిలో ఆయ‌న తరుపున ఎవ‌రూ అధికారికంగా బ‌రిలోకి దిగ‌లేదు. దీంతో స‌తీమ‌ణి అన్నా లెజ్నేవాను నిర్మాత‌గా లాంచ్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల భార్యలు నిర్మాణ రంగంలోకి రావడం కొత్తేమీ కాదు. మహేష్ సినిమాలకు నమ్రత శిరోద్కర్, రామ్ చరణ్ సినిమాల బాధ్యతల్లో ఉపాసన కొంతవరకు పాలుపం చుకుంటున్నారు.

ఇప్పుడు అదే బాటలో అన్నా లెజ్నేవా కూడా పవన్ కళ్యాణ్ సినిమాల నిర్మాణ వ్యవహారాలను, ముఖ్యంగా పీకే క్రియేటివ్ వర్క్స్ భాగస్వామ్యంతో వచ్చే చిత్రాలను పర్యవేక్షించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. అన్నా లెజ్నేవా ఇన్‌స్టాగ్రామ్ బయోలో `ర‌ష్యన్ హార్ట్..ఇండియాన్ సోల్`అని పేర్కొనడం మొదటి పోస్ట్‌లోనే చిరంజీవి గారి ఆశీస్సులు కోరడం చూస్తుంటే ఆమె మెగా కుటుంబ సంప్రదాయాలను బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గతంలో ఆమెకు హోటల్ రంగంలో వ్యాపార అనుభవం ఉండటం వల్ల సినిమాల బడ్జెట్ ప్రొడక్షన్ ప్లానింగ్‌లో ఆమె కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ కోసం , సామాజిక సేవల కోసం ఉపయోగిస్తానని గతంలోనే ప్రకటించారు. సొంత బ్యానర్‌లో సినిమాలు చేయడం వల్ల లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ బాధ్యతలను నమ్మకమైన వ్యక్తికి అప్పగించాలనుకున్న పవన్ అందుకు తన భార్య అన్నా లెజ్నేవానే సరైన ఎంపికగా భావించి ఉండవచ్చు. ఆమె సోషల్ మీడియా ఎంట్రీ అనేది భవిష్యత్తులో ఆమె చేపట్టబోయే పెద్ద బాధ్యతలకు ఒక పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వదినమ్మ అధికారికంగా నిర్మాణంలోకి దిగితే మెగా అభిమానులకు అది డబుల్ ధమాకా అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ వెండితెరపై మ్యాజిక్ చేస్తుంటే? తెర వెనుక అన్నా లెజ్నేవా నిర్మాణ భారాలను మోస్తూ ఆయనకు వెన్నుముకగా నిలిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. దీనిపై పీకే క్రియేటివ్ వర్క్స్ నుండి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాలి.

Tags:    

Similar News