హీరో వైఫ్ గ్లామర్ ఫోటో షూట్.. మళ్లీ అదే చర్చ?
తాజాగా ఆయన భార్య చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాత గాసిప్స్ మళ్లీ ముందుకు వచ్చాయి.;
టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో పర్సనల్ లైఫ్ మళ్లీ చర్చకు దారితీస్తోంది. తాజాగా ఆయన భార్య చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాత గాసిప్స్ మళ్లీ ముందుకు వచ్చాయి. పెళ్లయిన ఏడాది పూర్తి కాకముందే ఆ హీరోయిన్ పలు ప్రముఖ మ్యాగజైన్ల కోసం గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ, ట్రెండీ డ్రెస్సులు, బికినీల్లో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇండస్ట్రీలో ఇది కొత్త విషయం కాదని చెప్పాలి. స్టార్ హీరోల భార్యలు లేదా హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ ను కొనసాగిస్తూ గ్లామర్ ఫోటోషూట్లు చేయడం కామన్. అయితే ఆ హీరో విషయంలో మాత్రం ఈ అంశం ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం ఏంటంటే.. ఆయన గతంలో జరిగిన మొదటి పెళ్లి చుట్టూ కూడా ఇలాంటి చర్చలే వినిపించాయి.
అప్పట్లో ఆయన మొదటి భార్య కూడా స్టార్ హీరోయిన్ కావడంతో, ఆమె గ్లామర్ పాత్రలు, బికినీ సీన్లు చేయడంపై వివాదాలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో హీరోకు అది నచ్చలేదని, వ్యక్తిగత జీవితంలో విభేదాలు తలెత్తాయని గాసిప్స్ వినిపించాయి. చివరకు ఆ వివాహం విడాకులకు దారితీసిందని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆ విషయాలపై ఎప్పుడూ అధికారికంగా ఎవరూ స్పందించలేదు.
ఇప్పుడు రెండో వివాహం తర్వాత కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా వచ్చిన ఫోటోషూట్ లో హీరో భార్య బోల్డ్ లుక్స్ లో కనిపించడం, ఫ్యాషన్ మ్యాగజైన్లలో హైలైట్ కావడం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతుండగా, పాత విషయాలు గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం అని చెబుతున్నారు. హీరోయిన్లు తమ ప్రొఫెషన్ ప్రకారం గ్లామర్ ఫోటో షూట్లు చేయడం కామన్ అని, దానికి వ్యక్తిగత జీవితంతో కలపడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గతంలో వచ్చిన వార్తలు నిజమేనా అనే ఇప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి తరచూ వినిపిస్తుంటాయి. ఒకరి వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రతి వార్త నిజమనే చెప్పలేం. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో చిన్న విషయాలు కూడా పెద్ద చర్చకు దారితీస్తాయి. ప్రస్తుతం ఆ హీరో కుటుంబం విషయం అలాంటి చర్చల మధ్యలో నిలిచింది. అయితే దానిపై హీరో గానీ, ఆయన భార్య గానీ రెస్పాండ్ అవ్వలేదు. తమ వ్యక్తిగత జీవితాన్ని సీక్రెట్ గా ఉంచుకుంటూ ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక ఫోటో షూట్ చుట్టూ తిరిగే చర్చలు ఎంతవరకు నిజం, ఎంతవరకు గాసిప్ అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు త్వరగా స్ప్రెడ్ అవ్వడం మాత్రం ఎప్పుడూ జరుగుతున్నదే..