చిన్న సినిమా..ముప్పై లక్షల ఓటీటీ కహానీ!
చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఆధారం. ఎన్ని భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ నిర్మాణం జరుపుకున్న ఇండస్ట్రీని బ్రతికించేది చిన్న చిత్రాలే.. చిన్న చిత్నాల నిర్మాతలే.;
చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఆధారం. ఎన్ని భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ నిర్మాణం జరుపుకున్న ఇండస్ట్రీని బ్రతికించేది చిన్న చిత్రాలే.. చిన్న చిత్నాల నిర్మాతలే. అందుకే వారికి సహకరించండి..చిన్న సినిమాని బ్రతికించండి. అలా చేసినప్పుడే కొత్త టాలెంట్‌కు అవకాశాలు వస్తాయి. ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. కొత్త కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్‌లు పుట్టుకొస్తారు..` స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరూ గత కొన్ని దశాబ్దాలుగా చెబుతున్న మాటలివి. కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం టూ వరస్ట్.
స్టేజ్ ఎక్కితే..మైక్ దొరికితే స్టార్ హీరో నుంచి ప్రతి ఒక్కరూ ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా చిన్న సినిమాని పట్టించుకోవడం లేదు. బ్రతికి బట్టకట్టే విధంగా చర్యలు తీసుకోవడం లేదు అనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కథల చౌర్యం కూడా చాలా మంది చిన్న సినిమాల దర్శకులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దర్శకుడిగా అరంగేట్రం చేయాలని కోటీ ఆశలతో ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్న నవ తరం దర్శకులకు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
వాటికి తోడు ప్రొడ్యూసర్ సెట్టయి సినిమా పూర్తి చేసినా థియేటర్లు లభించని పరిస్థితి. అంతే కాకుండా ప్రేక్షకులు కూడా చిన్న సినిమాలకు థియేటర్లకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కొత్త దర్శకులు, నిర్మాతలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయాలని సినిమా ప్రారంభానికి ముందే వారితో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుని డైరెక్టర్‌లని పట్టుకుని ఓటీటీలని ప్రసన్నం చేసుకోవడం కోసం కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కానీ ఫలితం ఉండటం లేదు. కావాల్సిన వారు రికమెండ్ చేసినా అక్కడో గేట్ ప్రధాన అడ్డంకిగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో గేట్లేంటీ? అని అందరికి సందేహం రావచ్చు. సాఫ్ట్‌వేర్ జాబ్‌కు బ్యాక్ డోర్‌లా అన్నమాట. ఉత్తరాదిలో చాలా ఓటీటీలకు ఇదే తరహా బ్యాక్‌డోర్ దందా నడుస్తోంది. మామూలు పేరున్న ఓటీటీల నుంచి వరల్డ్ వైడ్‌గా నెట్ వర్క్ ఉన్న ఓటీటీల వరకు ఇదే దందా ప్రధానంగా నడుస్తూ వస్తోంది. ఇప్పుడు ఇదే దందా దక్షిణాదికి..ప్రధానంగా చెప్పాలంటే అన్ని ఓటీటీలకు కూడా పాకిపోయింది. ఓ చిన్న సినిమా ఓటీటీ అప్రువల్ ఇవ్వాలంటే అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దానికి మించి ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అదే డబ్బు. రూ.3 కోట్ల బడ్జెట్‌ని ఓటీటీ ప్లాట్ ఫామ్ రిలీజ్ చేయాలన్నా..ఒక స్క్రిప్ట్‌ని ఓకే చేయాలన్నా ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేట్ కీపర్స్..అంటే కంటెంట్ అప్రువల్ ఇచ్చే బ్యాచ్ చేతులు తడపాల్సిందే.
ఒక దశలో రూ.15 లక్షలుగా ఉన్న ఈ దందా ఇప్పుడు రూ.30 లక్షలకు చేరింది. అంత మొత్తం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇస్తేనే స్క్రిప్ట్ అక్కడ అప్రువల్ అవుతుంది.. సినిమా ముందుకు వెళుతుంది..అలా అప్రువల్ పొందిన స్క్రిప్ట్ కే రూ.3 కోట్ల బడ్జెట్‌ని విడతల వారిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ దందా ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో ఒక సినిమా స్క్రిప్ట్ అప్పువల్ కావాలన్నా..అది సినిమాగా మారాలన్నా రూ.30 లక్షలు ముందుగా సమర్పించుకోవాల్సిందే అని టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ రాకెట్ గుట్టు బయటపడేదెన్నడు..చిన్న సినిమా డైరెక్టర్లుకు విముక్తి లభించేది ఎప్పుడని దర్శకులుగా పరిచయం కావాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.