ఎక్స్ వీడియోస్ జాగ్రత్తలు చెబుతోంది

Update: 2017-10-15 05:51 GMT
ప్రస్తుత రోజుల్లో బోల్డ్ కంటెంట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఆ తరహా సినిమాలు చాలావరకు మంచి హిట్స్ గా నిలుస్తున్నాయి. కోలీవుడ్ లో అయితే బోల్డ్ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటోంది. అక్కడ మెస్సేజ్ ఓరియెంటెడ్ అంటే చాలు ఫుల్ గా బోల్డ్ కంటెంట్ తో తీసిన సినిమాలకు కట్ లేకుండా సెన్సార్ సర్టిఫికేట్ అందుతుంది. ఈ మధ్య కాలంలో కత్తెరలు పడుతున్నా కూడా సినిమాల్లో హాట్ సీన్స్ చాలా వరకు కుర్రకారును ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం తమిళ్ లో మరో బోల్ట్ కంటెంట్ సినిమా రెడీ అవుతోంది. సినిమా టైటిల్ కూడా కొంచెం వల్గర్ గానే ఉంది. ఏకంగా ఒక పోర్న్ వెబ్ సైట్ పేరును పెట్టేశారు. 'ఎక్స్ విడియెస్' అనే ఆ సినిమాను సుజో సుందర్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇది మొదటి సినిమా. సుందర్ ఇంతకుముందు ప్రముఖ తమిళ దర్శకుడు హరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. అయితే ఈ సినిమా అడల్ట్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా కాదని చెబుతున్నాడు దర్శకుడు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ తో పాటు మానవుడు చెడు ఆలోచనలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాను తీయడానికి ఒక కారణం ఉందని చెబుతూ..ఒక స్నేహితుడు తన భార్య నగ్న చిత్రాలను ఫోన్ లో షూట్ చేసినప్పుడు మొబైల్ లో ఉండే కొన్ని యాప్స్ తో పోర్న్ వెబ్ సైట్స్  కుమ్మక్కై ఆ వీడియో ని పోర్న్ వెబ్ సైట్స్ లలో పోస్ట్ చేశారని ఒక మిత్రుడు చెప్పడంతో ఆ ఆలోచన నుండి ఈ కథ పుట్టుకొచ్చిందని దర్శకుడు తెలిపాడు.

ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎన్నో వెలువడుతున్నాయని  ఫోన్లో ఏ యాప్ ఎలాంటిదో ఎవరికి తెలియదని మనకు తెలియకుండానే మన పర్సనల్ ఫొటోస్ ని హ్యాక్ చేసి పార్న్ వేబ్ సైట్స్ లో ప్రత్యేక్షం అయ్యేలా చేసే పరిస్థితులు ఉన్నాయని దర్శకుడు సుందర్ ట్రైలర్ లాంచ్ వేడుకలో తెలిపాడు. అంతే కాకుండా ఈ సినిమా మంచి మెస్సేజ్ ఇస్తుందని కూడా దర్శకుడు వివరించాడు.

Full View
Tags:    

Similar News