ఇక సొంతంగా.. ఫైర్ బ్రాండ్ మరింత పెచ్చిపోతుందేమో
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో ఒక విషయమై సోషల్ మీడియాలో ఈమద్య ఉంటూనే ఉంది. తనకు సంబంధం ఉన్నా లేకున్నా ట్రెండింగ్ విషయాలపై స్పందిస్తూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తన సినిమాల ప్రమోషన్ ల సమయంలో కూడా వివాదాలను రాజేసేలా మాట్లాడటం ఈమెకు అలవాటు. ఇప్పటి వరకు ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా వేరే బ్యానర్ ల్లో కాని ఇకపై సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యింది.
వివాదాస్పద హీరోయిన్ గా పేరు రావడంతో ఈ అమ్మడిని పలురు స్టార్ ఫిల్మ్ మేకర్స్ దూరంగా పెట్టాలని భావిస్తున్నారు. దాంతో కంగనా సొంతంగా నిర్మాణ సంస్థను మొదలు పెట్టింది. తనకు ఇష్టమైన సక్సెస్ ఫుల్ చిత్రం మణికర్ణిక పేరును తన బ్యానర్ కు పెట్టింది. మణికర్ణిక ఫిల్మ్స్ అంటూ బ్యానర్ పేరును పెట్టిన కంగనా త్వరలోనే ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇతర బ్యానర్ ల్లో నటించడం వల్ల కంగనా వివాదాల విషయంలో కాస్త తగ్గినా ఇక సొంత బ్యానర్ కనుక రెచ్చి పోవడం ఖాయం అంటున్నారు.
కంగనా తన సొంత బ్యానర్ లో మొదటి ప్రాజెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తర్వాత సినిమాల్లో కూడా ఈమె నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కంగనా ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో తలైవి సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా త్వరలో హిందీ.. తమిళం.. తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది.