నాన్న కోసం సినిమాల్లోకి.. బాధ్యతల కోసం దూరంగా!
దీంతో ఆయన తర్వాత వచ్చిన బాధ్యతలు కూడా అంతే విధిగా పూర్తి చేయాలని భావించి సినిమాలకు దూరమ య్యానన్నారు. 'ఛాంపియన్' సినిమాలో కూడా తొలుత నటించానని చెప్పానన్నారు.;
నందమూరి కల్యాణ్ చక్రవర్తి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన 'ఛాంపియన్' సినిమాలో రాజారెడ్డి పాత్రతో ప్రేక్షకుల్ని పలకరించారు. సినిమాలో ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో అప్పటి అభిమానులంతా కల్యాణ్ చక్రవర్తిని చూసి చాలా కాలమవుతుంది? అంటూ ముచ్చటించుకుంటున్నారు. నందమూరి వారసత్వం నుంచి వచ్చిన మరో నటుడు అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే కల్యాణ్ చక్రవర్తి హఠాత్తుగా సినిమాలు ఏ కారణంగా వదిలేసారు? అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
తాజాగా అందుకు గల కారణాలను రివీల్ చేసారు. తాను 'లంకేశ్వరుడు' సినిమా చేస్తోన్న సమయంలోనే నాన్న గారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో? అప్పటి వరకూ తండ్రి చూసిన వ్యాపార వ్యవహారాలు..కుటుంబ బాధ్యతలు, బరువులు తానే దగ్గరుండి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆ కారణంగా రోజులో చాలా సమయాన్నే కేటాయించాల్సి వచ్చిందన్నారు. దీంతో ఆ కారణంగా ఎలాంటి ప్రకటన లేకుండా సినిమాల్ని పక్కనబెట్టినట్లు గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి రావడానికి కారణం కూడా తండ్రే అని, ఆయన మాట కాదనలేకే మ్యాకప్ వేసుకున్నాన్నారు.
దీంతో ఆయన తర్వాత వచ్చిన బాధ్యతలు కూడా అంతే విధిగా పూర్తి చేయాలని భావించి సినిమాలకు దూరమ య్యానన్నారు. 'ఛాంపియన్' సినిమాలో కూడా తొలుత నటించానని చెప్పానన్నారు. కానీ నిర్మాత స్వప్న ఇంటికొచ్చి మాట్లాడటం.. రాజారెడ్డి పాత్ర, తెలంగాణ నేపథ్యం, రజాకర్ల కాలం ఇలా కొన్ని అంశాలు సినిమా లో ప్రత్యేకంగా ఉండటంతో? తనకు ఆసక్తి కలిగిందన్నారు. అలా 'ఛాంపియన్' లో తాను భాగమయ్యానన్నారు. మరి `ఛాంపియన్` తో రీ ఎంట్రీ ఇచ్చిన చక్రవర్తి ఇకపై నటుడిగా కొనసాగుతారా? ఈ సినిమాకే పరిమితమవుతారా? కొనసాగాలి అంటే అవకాశాలు కూడా రావాలి. మరి కల్యాణ్ చక్రవర్తి ఆ రకంగానూ బిజీ అవుతారా? అన్నది చూడాలి.
కల్యాణ్ చక్రవర్తి సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు, నిర్మాత త్రివిక్రమరావు తనయుడే కళ్యాణ చక్రవర్తి.కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత 'ఇంటి దొంగ', 'మారణ హోమం', 'రౌడీ బాబాయ్', 'అత్తగారు జిందాబాద్'తో పాటు పదికిపైగా సినిమాల్లో హీరోగా నటించారు. చిరంజీవి హీరోగా నటించిన 'లంకేశ్వరుడు' లో కీలక పాత్ర పోషిం చారు. ప్రస్తుతం కల్యాణ్ చక్రవర్తి చెన్నైలో స్థిరపడ్డారు. అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు.