వెంకీతో చిరు.. నెక్ట్స్ వెంకీతో ఏ హీరో నటిస్తున్నారు?
అనిల్ రావిపూడి ఈ తరం దర్శకులలో అత్యంత విజయవంతమైన దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు పట్టిందల్లా బంగారమే.;
మెగా - దగ్గుబాటి హీరోలను కలిపిన అనీల్ రావిపూడి తదుపరి దగ్గుబాటి- నందమూరి హీరోలను కలుపుతున్నారు..
మెగాస్టార్ చిరంజీవి-దగ్గుబాటి వెంకటేష్ లతో అతడు తెరకెక్కించిన `మన శంకర వరప్రసాద్ గారు` సంచలన విజయం సాధించింది. చిరు- వెంకీ కెమిస్ట్రీ పెద్ద తెరపై అద్భుతంగా వర్కవుటైందని కాంప్లిమెంట్లు వచ్చాయి.
అయితే ఈసారి దగ్గుబాటి వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్ లను కలిపి ఇప్పటికే సినిమా ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా మొదలు కాక ముందే ఎప్పటిలాగే మరో సంక్రాంతి అనీల్ రావిపూడి ఖాతాలో పడిపోయినట్టేనని అంచనాలు ఊపందుకున్నాయి.
అనిల్ రావిపూడి ఈ తరం దర్శకులలో అత్యంత విజయవంతమైన దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు పట్టిందల్లా బంగారమే. బాక్సాఫీస్ ని ఎదురే లేకుండా కుమ్మేస్తున్నాడు. ప్రతియేటా సంక్రాంతి పందేన్ని తన ఖాతాలో వేసేసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్‌లతో ఆయన తెరకెక్కించిన `మన శంకర వరప్రసాద్ గారు` (MSG) భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఇద్దరు అగ్ర హీరోల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపించి అందరినీ మెప్పించింది.
ఇప్పుడు అదే జోష్‌తో అనిల్ రావిపూడి మరో క్రేజీ మల్టీస్టారర్‌కు సిద్ధమయ్యారు. ఈసారి దగ్గుబాటి - నందమూరి కుటుంబాలకు చెందిన హీరోలను ఒకే తెరపైకి తెస్తున్నారు. రావిపూడి తన తదుపరి చిత్రంలో విక్టరీ వెంకటేష్ -నందమూరి కల్యాణ్ రామ్ లను కలిపి ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేశారు. ఈ ఇద్దరు హీరోలకు అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉంది.
వెంకటేష్‌తో రావిపూడి నాలుగు బ్లాక్ బస్టర్లు కొట్టాడు. 5వ సారి వెంకీతో కలిసి పని చేస్తున్నాడు. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, ఎంఎస్‌జి (మన శివశంకర వరప్రసాద్ గారు) చిత్రాల తర్వాత వెంకీ-అనిల్ రావిపూడి కాంబోలో 5వ సినిమా ప్రయాణం మొదలైంది. కల్యాణ్ రామ్‌తో 2వ సారి పని చేస్తున్నాడు. అనిల్ రావిపూడికి దర్శకుడిగా మొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా `పటాస్`. ఆ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి నటుడిగా జవజీవాలు నింపింది. అందుకే రావిపూడి అంటే కళ్యాణ్ రామ్ కి అమితమైన గౌరవం, అభిమానం. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కల్యాణ్ రామ్‌తో అనిల్ జట్టు కడుతున్నారు.
దగ్గుబాటి - నందమూరి ప్రాజెక్టుకు కూడా తనదైన మార్కు కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాను పండించేలా కథను సిద్ధం చేశారు. ఇది పక్కా ఫెస్టివల్ ట్రీట్‌లా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.
అనిల్ రావిపూడికి ఉన్న అతిపెద్ద బలం ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం. చిరంజీవి-వెంకటేష్‌ల మధ్య `ఎం.ఎస్.జి`లో చూపించిన మ్యాజిక్ ఇప్పుడు వెంకీ-కల్యాణ్ రామ్‌ల మధ్య కూడా రిపీట్ అయితే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం తో పాటు బాక్సాఫీస్ కనకవర్షం కురవడం ఖాయం.