టైర్ 2 హీరోస్ బాక్సాఫీస్ డేంజ‌ర్ గేమ్‌!

టాలీవుడ్‌లో ఇయ‌ర్‌ ఇయ‌ర్‌కి ట్రెండు మారుతోంది. గ‌తంలో 20 నుంచి 30 కోట్లల్లో సినిమాలు చేసిన హీరోలు ఈ మ‌ధ్య రూ.70 నుంచి రూ.90 కోట్ల బ‌డ్జెట్ల‌ల్లో సినిమాలు చేశారు.;

Update: 2026-02-26 18:30 GMT

టాలీవుడ్‌లో ఇయ‌ర్‌ ఇయ‌ర్‌కి ట్రెండు మారుతోంది. గ‌తంలో 20 నుంచి 30 కోట్లల్లో సినిమాలు చేసిన హీరోలు ఈ మ‌ధ్య రూ.70 నుంచి రూ.90 కోట్ల బ‌డ్జెట్ల‌ల్లో సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఆ బోర్డ‌ర్‌ని కూడా దాటేసి ఊహించ‌ని బ‌డ్జెట్ తో భారీ సినిమాల‌కు తెర‌లేపారు. వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టైర్ 2 స్టార్స్ ఒక్కో మూవీ బ‌డ్జెట్ రూ.120 కోట్ల నుంచి రూ.200 కోట్ల పైమాటే. బ‌డ్జెట్ అయితే భారీగానే పెంచేశారు కానీ రిట‌ర్న్స్ ప‌రిస్థితి ఏంట‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న విధంగా ఈ సినిమాలు స‌క్సెస్ అవుతాయా? పెట్టిన బ‌డ్జెట్‌ని మించి రాబడుతాయా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ రేసులో ముందు వ‌రుస‌లో ఉన్న హీరో నేచుర‌ల్ స్టార్ నాని. త‌ను న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `ది ప్యార‌డైజ్‌`. శ్రీ‌కాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఆగస్టు 21న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ముందు నుంచి మేకింగ్ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ బ‌డ్జెట్ ప‌రంగానూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌రికొత్త మేకోవ‌ర్‌తో నాని న‌టిస్తుండ‌టంతో దీనిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

దానికి త‌గ్గట్టుగానే దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. నాని సినిమాల్లో ఇదే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ కావ‌డంతో బిజినెస్ కు సంబంధించిన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌తో పాటు అంత‌ర్జాతీయ స్థాయిలోనూ రిలీజ్ చేయ‌బోతున్నారు. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెండు భారీ బ‌డ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. ఇందులో ఒక‌టి `రౌడీ జ‌నార్థ‌న‌`. ర‌వికిర‌ణ్ కోల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రొక‌టి `ర‌ణ‌బాలి`. ఇది పీరియాడిక్ ఫిల్మ్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ కానుండ‌గా, `రౌడీ జ‌నార్థ‌న‌` డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. `విరూపాక్ష‌` దాదాపు వంద కోట్ల క్ల‌బ్‌కు చేరువైన సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ సారి భారీ ప్లానే చేశాడు. `సంబ‌రాల ఏటిగ‌ట్టు` మూవీతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు రోహిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దీని బ‌డ్జెట్ పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం మేక‌ర్స్ ఏకంగా రూ.150 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.

మ‌రి ఇంత మొత్తం రిట‌ర్న్ వ‌స్తుందా? రిస్క్ చేస్తున్నారా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వీళ్ల‌తో పాటు ఇదే స్థాయిలో అక్కినేని నాగ‌చైత‌న్య కూడా రిస్క్ చేస్తున్నాడు. త‌ను న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `వృష‌క‌ర్మ‌`. కార్తీక్ దండు ద‌ర్శ‌కుడు. ఎస్‌వీసీ సినిమా బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. నిధి వేల నేప‌థ్యంలో సాగే మిస్టిక్ థ్రిల్ల‌ర్ ఇది. దీని కోసం ఏకంగా రూ.120 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కు రెడీ కానుంది. తెలుగులో మాత్ర‌మే స‌త్తా చాటిన టైర్ 2 హీరోలకు ఈ ఏడాది అత్యంత రిస్కీ ఇయ‌ర్‌గా మార‌బోతోంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మంచి మార్కెట్‌తో పాటు వ‌సూళ్ల‌ని రాబ‌డితే సేఫ్ ప్రాజెక్ట్స్ అవుతాయి.. అలా కాకుండా కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం అయితే మాత్రం బిగ్‌ రిస్క్ చేస్తున్న‌ట్టే.

Tags:    

Similar News