టాలెంట్ లో టాప్ క్లాస్… కానీ ప్లానింగ్ లో వెనుకంజ‌!

టాలీవుడ్ స్థాయి విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ప్రస్తుతం పోటీ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎనర్జీ, డ్యాన్స్, యూత్ ఫాలోయింగ్ ఉంటే చాలు హీరో రేస్‌లో నిలబడేవాడు.;

Update: 2026-02-26 22:30 GMT

టాలీవుడ్ స్థాయి విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ప్రస్తుతం పోటీ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎనర్జీ, డ్యాన్స్, యూత్ ఫాలోయింగ్ ఉంటే చాలు హీరో రేస్‌లో నిలబడేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్లినవాళ్లు కెరీర్లో స్పీడ్‌గా ముందుకు దూసుకెళ్తుంటే, కాస్త ఆలస్యం చేసినవాళ్లు అలానే రేసులో వెనకబడిపోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్ రామ్ పోతినేని కెరీర్‌పై ప్రశ్నలు మొదలవుతున్నాయి.

రామ్ దగ్గర టాలెంట్ గురించి ఎలాంటి సందేహం లేదు. అందానికి అందం, డ్యాన్సుల‌కు డ్యాన్సులు, స్టైల్ కు స్టైల్, యాక్టింగ్ కు యాక్టింగ్.. అన్నింటిలో రామ్ కు చాలా ప‌ట్టుంది. కానీ కెరీర్ ప్లానింగ్ విషయంలో క్లారిటీ లేక‌పోవ‌డంతో అత‌నింకా టైర్2 హీరోల లిస్ట్ లో ఉండేందుకు పోటీ ప‌డాల్సి వ‌స్తోంది. తనతో పాటూ వచ్చిన హీరోలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. నాని త‌న‌ను తాను కంటెంట్ హీరోగా బ్రాండ్ చేసుకున్నాడు. కథే స్టార్ అన్న ఫార్ములాతో ముందుకెళ్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా ఆంబిష‌న్స్ తో జానర్లు మార్చుకుంటూ ప్రయోగాలు చేస్తున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఈ మ‌ధ్యే స‌రైన ట్రాక్ లో వెళ్తూ కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తేజ స‌జ్జ లాంటి యంగ్ హీరోలు ఫాంటసీ, విజువల్ స్పెక్టకిల్ జానర్లతో త‌మ‌ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు.

ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఒక స్ట్రాటజీని న‌మ్మి, దాన్ని ఫాలో అవుతూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. కానీ రామ్ మాత్రం ఇంకా త‌న స్ట్రాట‌జీ విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌పోతున్న‌ట్టు అనిపిస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి భారీ క్సెస్ త‌ర్వాత‌, ఆ స‌క్సెస్ జోష్ లో కొత్తగా ఆలోచించి మార్కెట్ ను పెంచుకోవాల్సింది పోయి, అదే మాస్ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుని అక్క‌డే ఆగిపోయాడు.

ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నుంచి అత‌ను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, ఎంచుకుంటున్న డైరెక్ట‌ర్లు కూడా అలానే ఉన్నారు. ఈ మ‌ధ్య కూడా ప‌లు ప్రాజెక్టులు అనుకున్నాడు కానీ క‌న్ఫ్యూజ‌న్ తో రామ్ వేటినీ ఫైన‌లైజ్ చేయ‌లేక‌పోతున్నాడు. వీలైనంత త్వ‌ర‌గా దాన్నుంచి బ‌య‌టికొచ్చి రామ్ త‌న స్ట్రాట‌జీని అమ‌లు ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. లేక‌పోతే త‌న ప్రైమ్ ఏజ్ ను కోల్పోయే అవ‌కాశ‌ముంది.

ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నుంచి అత‌ను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, ఎంచుకుంటున్న డైరెక్ట‌ర్లు కూడా అలానే ఉన్నారు. ఈ మ‌ధ్య కూడా ప‌లు ప్రాజెక్టులు అనుకున్నాడు కానీ క‌న్ఫ్యూజ‌న్ తో రామ్ వేటినీ ఫైన‌లైజ్ చేయ‌లేక‌పోతున్నాడు. వీలైనంత త్వ‌ర‌గా దాన్నుంచి బ‌య‌టికొచ్చి రామ్ త‌న స్ట్రాట‌జీని అమ‌లు ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. లేక‌పోతే త‌న ప్రైమ్ ఏజ్ ను కోల్పోయే అవ‌కాశ‌ముంది. సింపుల్ గా చెప్పాలంటే, రామ్ ను స‌రైన దారిలో న‌డిపించే స్ట్రాట‌జీ ఇప్పుడ‌త‌నికి అవ‌స‌రం. ఈ ద‌శ‌లో రామ్ తీసుకునే నిర్ణ‌య‌మే ఎంతో కీల‌కం. ఆ డెసిష‌నే అత‌న్ని మ‌ళ్లీ టాప్ లైన్ లో నిలబెట్ట‌గ‌ల‌దు. లేదంటే ఇండ‌స్ట్రీలో ఉన్న పోటీ మ‌ధ్య త‌న ప్రైమ్ టైమ్ పూర్త‌వ‌డం త‌ప్ప మ‌రోటి మిగ‌ల‌దు.

Tags:    

Similar News