కెన‌డా త‌ర్వాత దుబాయ్‌లో కేఫ్ ఓపెన్ చేసిన హాస్య‌న‌టుడు

అయితే కొన్ని నెల‌లుగా కెన‌డాలో కొన్ని అరాచ‌క శ‌క్తులు క‌పిల్ శ‌ర్మ లాంటి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.;

Update: 2025-12-31 22:23 GMT

ప్ర‌ముఖ హస్య న‌టుడు క‌పిల్ శ‌ర్మ పేరు ఈ ఏడాది అంతా మార్మోగుతూనే ఉంది. టెలివిజ‌న్ రియాలిటీ షోల‌ను అత్యంత విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో, దేశ విదేశాల‌లో వ్యాపారాల‌ను నిర్వ‌హించ‌డంలో క‌పిల్ శ‌ర్మ నైపుణ్యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత‌డికి కెన‌డాలో అద్భుత‌మైన కేఫ్ ఉంది. అక్క‌డ లాభ‌దాయ‌క‌మైన వ్యాపారంతో నాలుగు చేతులా ఆర్జిస్తున్నాడు.

అయితే కొన్ని నెల‌లుగా కెన‌డాలో కొన్ని అరాచ‌క శ‌క్తులు క‌పిల్ శ‌ర్మ లాంటి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క‌పిల్ కి చెందిన కెన‌డా కేఫ్ పై గ్యాంగ్ స్ట‌ర్ల కాల్పుల క‌ల‌కలం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఆ స‌మ‌యంలో క‌పిల్ శ‌ర్మ పేరు మార్మోగింది.

అయితే హాస్య‌న‌టుడు క‌పిల్ శ‌ర్మ త‌గ్గేదేలే! అంటూ త‌న వ్యాపారాల‌ను విదేశాల్లో విస్త‌రిస్తున్నారు. ఇప్పుడు కెన‌డా త‌ర్వాత అత‌డు త‌న రెండో కాప్స్ కేఫ్ ని దుబాయ్ లో ప్రారంభించాడు. నూతన సంవత్సర వేడుకల ప్రారంభ‌ సమయానికి యుఏఇలో దీనిని ప్రారంభించాడు. త‌న పాపుల‌ర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సెట్ వైబ్ నుండి ప్రేరణ పొందిన ఈ రెస్టారెంట్ 31 డిసెంబర్ 2025 మిడ్ నైట్ ముహూర్తంతో ప్రారంభ‌మైంది. ఆహార ప్రియులకు ఇది అంద‌మైన చోటు.

కాప్స్ కేఫ్ ప్రారంభోత్సవాన్ని ప్రకటించిన‌ శర్మ దుబాయ్ స్కైలైన్‌తో ఉన్న చిన్న‌ వీడియోను షేర్ చేశారు. చేతిలో ఒక కప్పు కాఫీతో కస్టమర్‌ను పలకరిస్తూ క‌పిల్ క‌నిపించారు. ఈ రెస్టారెంట్ అలంకరణ కెనడాలోని సర్రేలోని కెఫే త‌ర‌హాలో హాయిగా , ఆకర్షణీయంగా క‌నిపిస్తోంది. కాప్స్ కేఫ్ ప్రారంభ రోజున సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తుంది .. దుబాయ్ బ్రాంచ్ మెనూ వివ‌రాలు తెలియాల్సి ఉంది. కెనడియన్ లొకేషన్ లోని కేఫ్ లో ఇండో వెస్ట్ర‌న్ స్టైల్ ఆహారాన్ని విక్ర‌యిస్తున్నారు. వడ పావ్ , పాస్తా సా ర‌క‌ర‌కాల‌ కాఫీలు, టీలు, ఇక్క‌డ ల‌భించును. విభిన్నమైన వంటకాల రుచుల‌ను అందిస్తున్నారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో డిజిటల్ రంగంలో క్రమంగా ఆదరణ పొందుతోంది. నాల్గవ సీజన్ ఇటీవల గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 5 నాన్-ఫిక్షన్ షోలలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది క‌పిల్ క్యాలిబ‌ర్ ని చెబుతోంది. నాల్గవ సీజన్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లలో ప్రియాంక చోప్రా జోనాస్ సంద‌డి చేసారు.

Tags:    

Similar News