నాన్న దిగుతానన్నా తనయుడు దిగనివ్వడా?
రాజీవ్ విషయంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా? ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రావడం లేదు.;
తండ్రులు ఏ రంగంలో ఉంటే? తనయులు కూడా అదే రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం అన్నది సహజంగా జరుగుతుంటుంది. దీన్ని వారసత్వాన్ని కొనసాగించడంగా చెబుతుంటాం. కానీ అందుకు భిన్నంగా సంగీత దర్శకుడు కోటి తనయుడి ప్రయాణం చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. కోటీ సీనియర్ సంగీత దర్శకుడు. ఎంతో మంది స్టార్లతో ఎన్నో సినిమా లకు పనిచేసారు. సంగీతంలో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదిం చుకున్నారు. కానీ ఆయన వారసుడు రాజీవ్ మాత్రం సంగీతం వృత్తికి బధులుగా నటనపై ఫ్యాషన్ తో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
'నోట్ బుక్' సినిమాతో హీరోగా ఎంట్రీ గా లాంచ్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది గానీ.. ఆ తర్వాత రాజీవ్ మాత్రం నటుడిగా బిజీ కాలేదు. వచ్చిన అవకాశాలతో సంతృప్తి చెందడం తప్ప అంతకు మించి రాజీవ్ పరిశ్రమలో సాధించింది ఏం లేదు. మరి కోటి లాంటి పెద్ద దర్శకుడు అండ ఉండగా అవకాశాలు రావా? అన్న సందేహం రావడం సహజమే. ఎవరికైనా వారసత్వం అన్నది ఎంట్రీ కార్డు వరకే. ఆ తర్వాత ట్యాలెంట్ తోనే రాణించాలి. దాంతో పాటు ఆవగింజంత అదృఫ్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఛాన్సు ఉంటుంది.
రాజీవ్ విషయంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా? ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రావడం లేదు. మరి డాడ్ ఇమేజ్ తో ఛాన్సులు అందుకోవచ్చు కదా? అంటే అందుకు తాను ఎంతమాత్రం ఒప్పుకోను అంటున్నాడు. నాన్న పరిశ్రమలో సాధించిన పేరును తన ద్వారా చెడగొట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదన్నాడు. నాన్న కూడా ఎవర్నీ అవకాశాలు అడిగే మనస్తత్వం కాదని, తాను కూడా అలాగే ఉంటానన్నాడు. ఒకవేళ తండ్రిగా తన కోసం ఓ మెట్టు దిగుతానన్నా? వద్దు అనే చెబుతానన్నాడు. తాను సక్సస్ అవ్వలేదు అన్న బాధ కోటికి ఉందన్నారు.
అలాగని చెప్పి ఆయన కోసం కూడా ఎవర్నీ ఛాన్స్ తాను అడగనన్నాడు. తండ్రి పేరు లేకుండా వచ్చే సినిమాలు మాత్రమే చేస్తానన్నాడు. పరిశ్రమలో కింద నుంచి ఎదిగడం అన్నదే తనకు నచ్చుతుందన్నాడు. అవకాశాలు రావడం ఆలస్యమైనా? తన ప్రయత్నాలు మాత్రం ఆపనన్నాడు. మొత్తానికి రాజీవ్ లో స్వతంత్రంగా ఎదిగాలి అన్న కసి పట్టుదల కనిపిస్తుంది. ప్రస్తుతం మారిన ట్రెండ్ నేపథ్యంలో కొత్త వారు సక్సస్ అవుతున్నారు. రాజీవ్ లాంటి నటులకు ఇప్పుడా ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రణాళిక అన్నది కరెక్ట్ గా ఉంటేనే సాధ్యమవుతుంది.