పర్సనల్ ర్యాంకింగ్స్‌లో టాప్ బెస్ట్ మూవీస్ ఇవే!
2025 ముగిసింది.. కొత్త ఏడాదిలోకి ప్రవేస్తున్నాం. ఈ ఏడాది చాలా వరకు క్రేజీ సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్‌తో పాటు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, బడ్జెట్ చిత్రాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి.;
2025 ముగిసింది.. కొత్త ఏడాదిలోకి ప్రవేస్తున్నాం. ఈ ఏడాది చాలా వరకు క్రేజీ సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్‌తో పాటు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, బడ్జెట్ చిత్రాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో కొన్ని సూపర్ హిట్‌లుగా నిలిస్తే మరికొన్ని పరాజయాల్ని చవిచూశాయి. ఓవరాల్‌గా అత్యధిక శాతం సినిమాలు నిరాశపరిచినా కొన్ని సినిమాలు మాత్రం హార్ట్ ని టచ్ చేశాయి. భారీ వసూళ్లని రాబట్టి బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో టాప్ బెస్ట్ మూవీస్‌గా నిలిచాయి.
బాలీవుడ్‌లో జాన్ అబ్రహం, సాదియా ఖతీబ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `ది డిప్లొమాట్`. శివం నాయర్ దర్శకత్వం వహించారు. బలవంతపు వివాహం తరువాత పాకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయ మహిళ ఉజ్మా అహ్మద్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. పాక్‌లో చిక్కుకున్న మహిళ ఉజ్మా అహ్మద్‌ని దౌత్యవేత్త జెపీ సింగ్ ఎలా ఆమెకు అండగా నిలిచాడు. తనని రక్షించి ఎలా ఇండియాకు తిరిగి తీసుకొచ్చాడనే కథతో రూపొందిన సినిమా ఇది. రియల్ లైఫ్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
రిషబ్‌శెట్టి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ మూవీ `కాంతార చాప్టర్ 1`.తొలి భాగం సైలెంట్‌గా విడుదలై ఐదు భాషల్లో సంచలనం సృష్టించడం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడంతో ప్రీక్వెల్‌గా వచ్చిన `కాంతార చాప్టర్ 1`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫస్ట్ పార్ట్‌కు మించి గ్రాండ్ స్కేల్ మేకింగ్, అబ్బుర పరిచే సన్నివేశాలు, షాకింగ్ క్లైమాక్స్‌తో సినిమా టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. డివోషనల్ టచ్‌తో పీరియాడిక్ ఫీల్‌ని కలిగించడంతో ప్రతీ ఒక్కరు ఈ మూవీని లైక్ చేశారు.
స్టోలెన్ హిందీతో రూపొందిన ఓ సర్వైవల్ థ్రిల్లర్. దీనికి కరణ్ తేజ్ పాల్ దర్శకత్వం వహించాడు. అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో నటించాడు. ఇద్దరు సోదరులు చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారంలో చిక్కుకోవడంతో వారి జీవితాల్లో పెను సవాళ్లు ఎదురవుతాయి. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్నదే ఈ మూవీ అసలు కథ. రియల్ ఇన్సి డెంట్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన మూవీ ఆసక్తికరమైన మలుపులతో సాగుతూ సగటుప్రేక్షకుడిని వెంటాడుతుంది.
ఇదే తరహాలో క్రైమ్ స్టోరీ నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన మూవీ `కోర్ట్`. నేచురల్ స్టార్ నాని దీన్ని నిర్మించాడు. శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్ మినహా అంతా కొత్త వారితో చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక ప్రేమ జంటని విడదీయడం కోసం పోక్సో చట్టంతో అమ్మాయి బంధువు ఆడిన గేమ్ నేపథ్యంలో ఈ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అత్యంత తక్కువ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల మేర వసూళ్లని రాబట్టిందంటే ఏ స్థాయిలో ప్రేక్షకుల్లో అటెన్షన్‌ని క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్, చైనీస్ యానిమేషన్ మూవీ నే ఝా 2, హాలీవుడ్ హీరో బ్రాడ్ పీట్ నటించిన ఎఫ్1 స్పోర్ట్స్ డ్రామా, గ్రాఫిక్స్ ప్రధానంగా సాగిన డివోషనల్ యానిమేషన్ మూవీ, యంగేజ్ లవ్ డ్రామా లిటిల్ హార్ట్స్, స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న `ధురంధర్` ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో పర్సనల్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాయి. ఇక కేసరి చాప్టర్ 2, చావా, కుబేర, రైడ్ 2, కాల్, ఎలవన్ చిత్రాలు కూడా మంచి ఇంపాక్ట్‌ని కలిగించాయి.